“పుష్ప”లోని ఈ డైలాగ్… అంతకుముందే “వేణు మాధవ్” చెప్పారా..? ఎక్కడంటే..?

“పుష్ప”లోని ఈ డైలాగ్… అంతకుముందే “వేణు మాధవ్” చెప్పారా..? ఎక్కడంటే..?

by Mohana Priya

Ads

ఎంతో కాలం వెయిట్ చేసిన తర్వాత డిసెంబర్‌లో పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది.

Video Advertisement

దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు. అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వస్తోంది. పుష్ప సినిమా థియేటర్లలో నడుస్తుండగానే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. హిందీ వెర్షన్ తో సహా అన్ని భాషల్లో సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.

reasons behind pushpa negative talk

పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయినప్పటికంటే, ఇప్పుడే చాలా మంచి టాక్ వస్తోంది. ఎంతో మంది సెలబ్రిటీలు సినిమా చూసి, సినిమా చాలా బాగుంది అని, అల్లు అర్జున్ ఈ సినిమాలో చాలా బాగా నటించారు అని సోషల్ మీడియా ద్వారా పొగుడుతున్నారు. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు మాత్రమే కాకుండా, బాలీవుడ్ కి సంబంధించిన ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ నటనని ప్రశంసించారు. దాంతో పుష్ప రెండవ పార్ట్ విడుదలకి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

2venu madhav

ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. అందులో అల్లు అర్జున్ పోషించిన పుష్ప రాజ్ పాత్ర కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటాడు. అప్పుడు అక్కడ ఉన్న ఒకతను వచ్చి, “కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నావు” అని చెప్పి అడుగుతాడు. అందుకు పుష్ప, “నా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే ఏమౌతుంది?” అని చెప్తాడు. అయితే కొద్ది సంవత్సరాల క్రితం ప్రముఖ నటుడు వేణు మాధవ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఇలాగే చెప్పారు. ఎవరో వేణు మాధవ్ కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు అని అన్నారట. అందుకు వేణు మాధవ్ గారు, “నా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాను” అని చెప్పారట. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

watch video :


End of Article

You may also like