Ads
ఎంతో కాలం వెయిట్ చేసిన తర్వాత డిసెంబర్లో పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది.
Video Advertisement
దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు. అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వస్తోంది. పుష్ప సినిమా థియేటర్లలో నడుస్తుండగానే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. హిందీ వెర్షన్ తో సహా అన్ని భాషల్లో సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.
పుష్ప సినిమా ద్వారా కేవలం సౌత్ లో మాత్రమే కాకుండా నార్త్ లో కూడా అల్లు అర్జున్ చాలా పాపులర్ అయ్యారు. అంతకు ముందు నుండి అల్లు అర్జున్ చాలా ఫేమస్. కానీ పుష్పతో నార్త్ లో కూడా అల్లు అర్జున్ ఒక ఇమేజ్ సంపాదించారు. ఎంతో మంది ప్రముఖులు సినిమా చూసి, సినిమా చాలా బాగుంది అని, అల్లు అర్జున్ ఈ సినిమాలో చాలా బాగా నటించారు అని సోషల్ మీడియా ద్వారా పొగుడుతున్నారు.
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ఇటీవల జొమాటోకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. జొమాటోకి అల్లు అర్జున్ చేసిన ఎడ్వర్టైజ్మెంట్ ఇవాళ విడుదల చేశారు. ఈ ఎడ్వర్టైజ్మెంట్ లో అల్లు అర్జున్ తో పాటు నటుడు సుబ్బరాజు కూడా ఉన్నారు. అయితే ఈ ఆడియోకి, పుష్ప సినిమాలో ఏ బిడ్డ పాటలోని వీడియో సింక్ చేసి ఎడిట్ చేసి హైదరాబాద్ హవా మీమ్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ షేర్ చేశారు.
watch video :
https://www.instagram.com/tv/CZjIwcLIE4T/?utm_medium=copy_link
End of Article