Home Filmy Adda ఏంటి సుకుమార్ గారు?… ఎర్ర చందనంని నీళ్ళలో స్మగ్లింగ్ చేసే సీన్ ఇక్కడి నుండి కాపీ కొట్టారా.?

ఏంటి సుకుమార్ గారు?… ఎర్ర చందనంని నీళ్ళలో స్మగ్లింగ్ చేసే సీన్ ఇక్కడి నుండి కాపీ కొట్టారా.?

by Mohana Priya

ప్రస్తుతం పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది.

దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు. అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వస్తోంది. పుష్ప సినిమా థియేటర్లలో నడుస్తుండగానే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. హిందీ వెర్షన్ తో సహా అన్ని భాషల్లో సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.

pushpa red sandalwood scene copied from a tamil movie

పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయినప్పటికంటే, ఇప్పుడే చాలా మంచి టాక్ వస్తోంది. ఎంతో మంది సెలబ్రిటీలు సినిమా చూసి, సినిమా చాలా బాగుంది అని, అల్లు అర్జున్ ఈ సినిమాలో చాలా బాగా నటించారు అని సోషల్ మీడియా ద్వారా పొగుడుతున్నారు. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు మాత్రమే కాకుండా, బాలీవుడ్ కి సంబంధించిన ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ నటనని ప్రశంసించారు. దాంతో పుష్ప రెండవ పార్ట్ విడుదలకి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

pushpa red sandalwood scene copied from a tamil movie

పుష్ప సినిమా సూపర్ హిట్ అవడానికి కొన్ని సీన్స్ కూడా ముఖ్య కారణంగా నిలిచాయి. అందులోనూ ఎర్రచందనం దుంగలని ఒక చోట నుండి మరొక చోటికి తీసుకువెళ్లే సీన్ అయితే సినిమాకి ఒక హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాలో పోలీసులు రైడ్ చేయడానికి వస్తున్నారు అని తెలిసి హీరో ఎర్రచందనం దుంగలని నీటిలో పడేస్తాడు. ఇదే సీన్ మరొక సినిమాలో కూడా ఉంది. విజయ్ కాంత్ హీరోగా నటించిన కెప్టెన్ ప్రభాకర్ అనే సినిమాలో దాదాపు ఇలాంటి సీన్ ఒకటి ఉంటుంది. ఈ సినిమాకి సెల్వమణి దర్శకత్వం వహించారు. ఇందులో హీరో కూడా ఇలాగే నీటి ద్వారా ఎర్రచందనాన్ని తరలిస్తున్న ఒక ముఠాని పట్టుకుంటాడు.

watch video :

You may also like