“పుష్ప- ద రూల్” స్టోరీ లీక్..! సెకండ్ పార్ట్‌లో మెయిన్ ట్విస్ట్ ఇదేనా..?

“పుష్ప- ద రూల్” స్టోరీ లీక్..! సెకండ్ పార్ట్‌లో మెయిన్ ట్విస్ట్ ఇదేనా..?

by Mohana Priya

Ads

ప్రస్తుతం పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది.

Video Advertisement

దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు. అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వస్తోంది. పుష్ప సినిమా థియేటర్లలో నడుస్తుండగానే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. హిందీ వెర్షన్ తో సహా అన్ని భాషల్లో సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.

పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయినప్పటికంటే, ఇప్పుడే చాలా మంచి టాక్ వస్తోంది. ఎంతో మంది సెలబ్రిటీలు సినిమా చూసి, సినిమా చాలా బాగుంది అని, అల్లు అర్జున్ ఈ సినిమాలో చాలా బాగా నటించారు అని సోషల్ మీడియా ద్వారా పొగుడుతున్నారు. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు మాత్రమే కాకుండా, బాలీవుడ్ కి సంబంధించిన ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ నటనని ప్రశంసించారు. దాంతో పుష్ప రెండవ పార్ట్ విడుదలకి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

do you remember this actress in bahubali

సినిమా బృందం కూడా సెకండ్ పార్ట్ కి సంబంధించిన డిస్కషన్స్ ఇప్పటికే మొదలు పెట్టారు. మొదటి భాగంతో పోలిస్తే రెండవ భాగం కథాపరంగా చాలా బలంగా ఉంటుంది అని, అలాగే చాలా ఎమోషన్స్ కూడా ఉంటాయని సుకుమార్ చెప్పారు. అయితే పుష్ప – ద రూల్ కథ ఇదే అంటూ ఒక కథ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో హీరో తల్లి పాత్రపై ఎక్కువ శాతం కథ నడుస్తుందట. పుష్ప రాజ్ తన తల్లిని ఇబ్బంది పెడుతున్న అన్నలకి ఎలా బుద్ధి చెప్పాడు అనే అంశం చుట్టూ కథ తిరుగుతుందట.

reasons behind pushpa negative talk

అంతే కాకుండా, ఈ సినిమాలో పుష్ప రాజ్ కి, తండ్రికి మధ్య ఉండే సీన్స్, అసలు పుష్పతో తన తండ్రి ఎంత ప్రేమగా ఉండే వాడు అనేది కూడా చూపిస్తారు అని సమాచారం. అలాగే మొదట్లో గోవిందప్ప పుష్పతో, ” నువ్వు ఇప్పుడు గెలిచినా కూడా, ముందు ముందు చాలా సమస్యలు ఎదుర్కొంటావు” అని అర్థం వచ్చేలాగా చెప్తాడు. దీన్ని బట్టి చూస్తే, పుష్ప రాజ్ కి చాలా పెద్ద సమస్యలు ఎదురవుతాయని మనకు ముందే హింట్ ఇచ్చారు.

reasons behind pushpa negative talk

పుష్ప రాజ్ తనకి చాలా దగ్గరి మనుషుల్లో ఎవరో ఒకరిని కోల్పోతాడు అని, సినిమాకి ఇది ఒక పెద్ద ట్విస్ట్ అవ్వబోతోంది అనే అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి సీన్స్ మనం రంగస్థలం పాటు, జగడం, 1-నేనొక్కడినే వంటి గత సుకుమార్ సినిమాల్లో కూడా చూశాం. ఇవన్నీ మాత్రమే కాకుండా, పుష్పకి, షెకావత్ సర్ కి మధ్య కూడా చాలా గొడవలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే అసలు సెకండ్ పార్ట్‌లో కథ ఎక్కువగా ఫోకస్ అయ్యేది కూడా వీరిద్దరి మీదే. సినిమా బృందం సెకండ్ పార్ట్ షూటింగ్ ఫిబ్రవరిలో మొదలు పెడతారు అని, అలాగే ఎక్కువ లేట్ చేయకుండా సినిమా కూడా తొందరగానే విడుదల చేస్తారని సమాచారం.


End of Article

You may also like