Ads
అల… వైకుంఠపురములో చిత్రంతో భారీ హిట్ అందుకున్న బన్నీ ప్రస్తుతం తన స్నేహితుడు సుకుమార్ దర్శత్వంలో పుష్ప మూవీ చేస్తున్నాడు.ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొంత షూటింగ్ కూడా పూర్తయింది.
Video Advertisement
ఈచిత్రంలో మొదట విలన్ గా తమిళ నటుడు విజయ సేతుపతి అనుకున్నారు.కాని షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి కరోనా ఉదృతి దేశంలో ప్రారంభమవ్వడంతో ఈ చిత్ర షూటింగ్ అటకెక్కింది.దానితో విజయ సేతుపతి పుష్ప నుండి తప్పుకున్నట్లు రూమర్స్ వచ్చాయి.వాటి పై చిత్ర యూనిట్ ఇప్పటివరకు స్పందించలేదు.
దానితో అందరూ ఇది ఒట్టి రూమర్ అనుకున్నారు.కాని తాజాగా విజయ సేతుపతి ఇంగ్లీష్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తను డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల నిజంగానే తప్పుకున్నాని అన్నారు.దానితో ఈ చిత్రంలో విలన్ గా ప్రస్తుతం ఎవరి నటించబోతున్నారో అనే అంశం పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది.
End of Article