పుట్టినరోజు ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవాలనుకున్నాడు…పోలీసుల భయంతో మృతి?

పుట్టినరోజు ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవాలనుకున్నాడు…పోలీసుల భయంతో మృతి?

by Megha Varna

Ads

ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకి ఈ కరోనా మహమ్మారి విజృభిస్తుంది .సామజిక దూరం పాటించాలని దాదాపు అన్ని దేశాలలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే ..అత్యవసరం అయితే బయటకు రాకూడదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి ..దీంతో అంతా ఇంటికే పరిమితమయ్యారు.ఈ లాక్ డౌన్ లో అవసరం లేకుండా బయట సరదాగా తిరిగేవాళ్లు ఎక్కువైపోవడంతో పోలీస్ లు లాటి ఛార్జ్ చేస్తున్నారు ..

Video Advertisement

దీంతో పాపం నిజంగా అవసరం ఉండీ బయటకు వచ్చినవాళ్లు కూడా పోలీస్ దెబ్బలకు బలైపోతుండడం మనం సోషల్ మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం…దీంతో బయటకు రావాలంటే పోలీసులు ఎక్కడ కొడతారో అనే భయం ప్రజలలో బలంగా ఏర్పడింది.ఈ నేపథ్యంలో పోలీస్ లకు బయపపడి పారిపోతూ బావిలో పడి మృతి చెందాడు ఓ యువకుడు…వివరాల్లోకి వెళ్తే….

పోలిసుల కధనం ప్రకారం ..కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆడెపు రాజగోపాల్ అనే 23 సవంస్త్రాల యువకుడు పుట్టినరోజు సందర్భంగా ఇల్లంతకుంట మండలం మల్యాల గ్రామంలో తాటి చెట్ల వద్దకు వెళ్ళాడు ..స్నేహితులతో కలిసి కల్లు తాగుతుండగా పోలీసులు వస్తున్నారని సమాచారం రావడంతో భయంతో పరుగెడుతూ అకస్మాత్తుగా బావిలో పడి మృతి చెందాడు.దీంతో పుట్టినరోజే రాజగోపాల్ కు చివరి రోజుగా మారింది ..

ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు .వారిని ఓదార్చడం ఎవరి వాళ్ళ కావట్లేదు.గ్రామస్తులంతా కూడా విషాదంలో మునిగి పోయారు .అనంతరం స్థానికుల సహాయంతో మృత దేహాన్ని బావిలో నుండి బయటకు తీసి ఏరియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమ్మితం పంపించారు పోలీసులు ..

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు..ఈ ఘటనపై నెటిజన్లు స్పందిస్తూ ..పోలీస్ లు వస్తే మహా అయితే స్టేషన్ కు తీసుకువెళ్లి కౌన్సలింగ్ ఇచ్చి ఇంటికి పంపుతారు..లేదా జరిమానా విధిస్తారు అంతేగాని ప్రాణాలు తీసెయ్యరుగా పోలీసులు ..రాజగోపాల్ అనవసరంగా భయంతో పారిపోయి ప్రాణాలు పోగుట్టుకున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు ..


End of Article

You may also like