లక్షలు పెడితే కూడా సాధ్యం కానిది… కేవలం యూట్యూబ్ వీడియోస్ తో సాధించింది..!

లక్షలు పెడితే కూడా సాధ్యం కానిది… కేవలం యూట్యూబ్ వీడియోస్ తో సాధించింది..!

by Megha Varna

Ads

మనసు ఉంటే మార్గం ఉంటుంది. నిజానికి మనం అనుకున్నది సాధించాలంటే మన దగ్గర డబ్బులక్కర్లేదు. గట్టిగా దానిని అనుకుంటే సరిపోతుంది. చదువుకి అస్సలు పేదరికం అడ్డే కాదు. చాలా మంది చదువుకోవాలని ఉన్నా సరే పేదరికం వలన చదువుకోలేరు. అయితే పేదరికం వలన చదువుకోలేము అని అనుకోవడం పొరపాటు.

Video Advertisement

లక్షలు పెట్టినా సరే సాధ్యం కానిది ఈమె కేవలం యూట్యూబ్ వీడియోలు ద్వారా సాధించింది ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌ పట్టణం నామ్‌దేవ్‌వాడకు చెందిన హారిక యూట్యూబ్ వీడియోస్ తో అనుకున్నది సాధించింది. సతీశ్ కుమార్, అనురాధ కూతురు ఈమె.

హారిక తండ్రి సతీశ్ కుమార్ చనిపోవటంతో బీడీ కార్మికురాలిగా పని చేస్తూ అనురాధ ఇంటిని నెట్టుకొస్తోంది. హారిక బాగా చదువుతుంది. టెన్త్ క్లాసు లో 9.5 జీపీఏ, ఇంటర్‌లో 942 మార్కులు వచ్చాయి ఈమెకి.  నీట్‌ లో జాతీయ స్థాయి లో 40 వేల ర్యాంకు రాగ.. రాష్ట్ర స్థాయిలో 700 వ ర్యాంకు వచ్చింది. ఈమె రెండు సార్లు నీట్ పరీక్షని వ్రాసింది. కోచింగ్‌ తీసుకోవడానికి డబ్బులు లేకపోవడంతో ఈమె యూట్యూబ్‌ లోనే క్లాసులు విని పరీక్ష వ్రాసిందిట. చాలా మంది ఫోన్ల లో సినిమాలు, ఆటలు ఆడి సమయం వృధా చేసుకుంటుంటే హారిక మాత్రం ఏకంగా నీట్ ర్యాంక్ తెచ్చుకుంది. నిజంగా ఈమెని మెచ్చుకునే తీరాలి.

 


End of Article

You may also like