Ads
ప్రపంచమంతటిని కరోనా వైరస్ వణికిస్తుంది ..కాగా భారతదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకి విజృంభిస్తుంది .ప్రతి రోజు కరోనా మరణాల సంఖ్య ,వ్యాధి బారిన పడుతున్నవారు మరియు అనుమానితుల సంఖ్య పెరుగుతూ పోతుంది . ఇలాంటి పరిస్థితుల్లో కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తూ ,క్వారంటైన్ లో ఉన్న వారిపై నిఘా పెట్టడం ప్రభుత్వాలకు పెద్ద ఛాలెంజ్ గా మారింది .క్వారంటైన్ లో ఉన్న వారు బయటకు వస్తే ఈ వ్యాధి మరింతగా విస్తరిస్తుంది కాగా ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు ఈ క్వారంటైన్ లో నిఘా ఎలా పెడుతున్నాయి అనే విషయం చాల ఆశక్తికరంగా మారింది ..ఇక వివరాలలోకి వెళ్తే…
Video Advertisement
క్వారంటైన్ లో ఉన్న వారిని టెక్నాలజీ సహాయంతో పర్యవేక్షిస్తూ ఈ విధంగా నిఘా పెట్టాయట కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. వారి ఫోన్ నెంబర్ ద్వారా ట్రాక్ చేస్తుండగా , మరి కొన్ని రాష్ట్రాలు వారిని ప్రతి గంటకు సెల్ఫీ పంపాలని ఆదేశిస్తున్నాయి అంట . ఈ రెండు కుదరని పక్షంలో దగ్గరలోని పోలీసులు కానీ , ఆరోగ్య సేవ కార్యకర్తలు కానీ వారి ఇళ్లకు వెళ్లి పరిశీలించమని చెప్తున్నారు . అయితే టెక్నాలజీతో ఎలా ట్రాక్ చేస్తున్నారు? ఇంత మందిని ఇలా ట్రాక్ చేస్తున్నారు? ఒకవేళ ఎవరైనా క్వారంటైన్ ఉల్లంఘిస్తే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అనే వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో 25వేల మంది హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. వారందిరినీ జియో లొకేషన్… అంటే వారి ఫోన్ నుంచి వచ్చే సిగ్నల్‌ని కోవిడ్ 19 యాప్ ద్వారా ట్రాక్ చేస్తున్నట్టు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆరోగ్య అనే ఒక సరికొత్త యాప్ సహాయంతో క్వారంటైన్ లో ఉన్న వారి వివరాలు ఎప్పటికప్పుడు పరిశీలుస్తునట్లు అధికారులు తెలిపారు . విదేశాల నుండి వచ్చిన వారిపై మరియు ఢిల్లీ జమాత్ సభలకు వెళ్లి వచ్చినవారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఏదైనా అనుమానం వచ్చినపుడు ఉన్నతాధికారులకు తెలియచేస్తూ గ్రామ వాలంటీర్లు ,ఆశ వర్కర్లు కీలక పాత్ర వహిస్తున్నారు .అయితే కొంతమంది దొరక్కుండా తప్పించుకుని తిరిగే ప్రయత్నం చేశారు.
అలాంటి వారి వివరాలు తీసుకుని వారి మొబైల్ ఫోన్‌ని జియో ట్యాగ్ చేసి వారి కదలికల్ని గమనిస్తూ ఉన్నాం. క్వారంటైన్‌లో ఉన్న వారికి పాజిటివ్ అని తేలిన కేసులో వారి మొబైల్ కాల్ రికార్డ్స్ ట్రాక్ చేసి వారికి కాంటాక్ట్‌లోకి వచ్చిన వారిని ట్రేస్ చేశాం” అని ఏపీ సీఎం కార్యాలయానికి చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు.అయితే ఈ ఆపరేషన్ అంతా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ వారి వీక్షణలో జరుగుతున్నట్లుగా అధికారులు తెలిపారు.
జియో ట్యాగింగ్ పలు పద్ధతుల్లో చేయవచ్చు. లొకేషన్ మాత్రమే సేకరించటం జరుగుతుంది. ఉదాహరణకు హోమ్ క్వారంటైన్‌లో ఉండే వారి ఫోన్‌లో ఒక మొబైల్ అప్లికేషన్ ఇన్ స్టాల్ చేసి, ప్రభుత్వ సర్వర్‌కి ఎప్పటికప్పుడు అతని లొకేషన్ కోఆర్డినెట్స్ పంపుతుంది.కాగా ప్రభుత్వం ఒక నిర్ణిత దూరాన్ని ముందుగా నిర్దేశిస్తుంది ఒకవేళ ఆ దూరాన్ని దాటినట్లయితే అలెర్ట్ వస్తుంది. కానీ ఇందులో రెండు షరతులు ఉన్నాయి.మొబైల్ లో ఫోన్ సెట్టింగ్ ఆన్ చేసి ఉండాలి మరియు ఫోన్ వ్యక్తి దగ్గర ఉండాలి .ఇలా కానీ సమయంలో ట్రాక్ చేయడం సాధ్యపడదు .
ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం గంటకి ఒకసారి క్వారంటైన్‌లో ఉన్నవారిని సెల్ఫీ దిగి యాప్ లో పంపాలని నిర్దేశించింది ..దీంతో వారు ఇంట్లోఉన్నారా లేదా బయట ఉన్నారా అని ఆ సెల్ఫీ దిగిన లొకేషన్ ట్రాక్ చేయడం వలన తెలుస్తుంది . కేంద్ర ప్రభుత్వం కూడా గురువారం ఆరోగ్య సేతు అనే యాప్ ను విడుదల చేసింది . ఈ యాప్ బ్లూటూత్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ట్రాక్ చేసేందుకు, అలాగే సమాచారం అందించేందుకు కూడా ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
End of Article