ఏంటండీ.. పుష్పలో హీరో “అల్లు అర్జున్” కాదా..? వైరల్ అవుతున్న ఈ బాలీవుడ్ హీరోయిన్ రివ్యూ.!

ఏంటండీ.. పుష్పలో హీరో “అల్లు అర్జున్” కాదా..? వైరల్ అవుతున్న ఈ బాలీవుడ్ హీరోయిన్ రివ్యూ.!

by Mohana Priya

Ads

ప్రస్తుతం పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది.

Video Advertisement

దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు. అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వస్తోంది. పుష్ప సినిమా థియేటర్లలో నడుస్తుండగానే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. హిందీ వెర్షన్ తో సహా అన్ని భాషల్లో సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.

పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయినప్పటికంటే, ఇప్పుడే చాలా మంచి టాక్ వస్తోంది. ఎంతో మంది సెలబ్రిటీలు సినిమా చూసి, సినిమా చాలా బాగుంది అని, అల్లు అర్జున్ ఈ సినిమాలో చాలా బాగా నటించారు అని సోషల్ మీడియా ద్వారా పొగుడుతున్నారు. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు మాత్రమే కాకుండా, బాలీవుడ్ కి సంబంధించిన ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ నటనని ప్రశంసించారు. దాంతో పుష్ప రెండవ పార్ట్ విడుదలకి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

raai laxmi review for pushpa goes viral

అయితే ఇదిలా ఉండగా, ఒక బాలీవుడ్ నటి పుష్ప సినిమా చూసి ఇచ్చిన రెస్పాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ నటి లక్ష్మీ రాయ్ అందరికీ గుర్తుండే ఉంటారు. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించడంతో పాటు ఖైదీ నెంబర్ 150 లో ఒక స్పెషల్ సాంగ్ కూడా చేశారు లక్ష్మీ రాయ్. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో లక్ష్మీ రాయ్ బిజీగా ఉన్నారు. ఇటీవల ఒక బాలీవుడ్ మీడియా వాళ్లు లక్ష్మీ రాయ్ ని పుష్ప సినిమా చూశారా ఎలా ఉంది అని అడిగారు. అందుకు లక్ష్మీ రాయ్, “చూశాను చాలా బాగుంది” అన్నారు. అలాగే హీరో నటన ఎలా ఉంది అనే విషయంపై మాట్లాడుతూ, “అల్లు అరవింద్ చాలా బాగా చేశారు” అని చెప్పారు. అల్లు అర్జున్ ని పొరపాటుగా అల్లు అరవింద్ అనడంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

watch video :

https://www.instagram.com/tv/CY1ogfIjRvZ/?utm_source=ig_web_copy_link


End of Article

You may also like