Ads
ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమా రాధే శ్యామ్ గురించి అభిమానులు దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. భారతదేశం అంతటా కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Video Advertisement
రాధే శ్యామ్ ఓ వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఎంపిక చేయనున్నారు. అలా అని ఇది బయోపిక్ కాదు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. కృష్ణం రాజు సమర్పణలో యువి క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన రాధే శ్యామ్ టీజర్, పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల ఆసక్తిని ఇంకా పెంచాయి.
అయితే జనవరిలో విడుదల అవ్వాల్సిన రాధే శ్యామ్ సినిమా వాయిదా పడి మార్చ్‌లో విడుదల అవ్వబోతోంది. దాంతో రాధే శ్యామ్ సినిమా బృందమంతా సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. ఇదిలా ఉండగా సినిమా కథ ఇదే అంటూ ఒక వార్త వినిపిస్తోంది. రాధే శ్యామ్ సినిమా ప్రముఖ పామిస్ట్ అయిన చెరో జీవితం అధరంగా రూపొందించారట. చెరో చాలా పేరు పొందిన ఒక పామిస్ట్. చెరోకి పెళ్లి మీద ఆసక్తి లేదు. కానీ తను భవిషత్తులో ప్రేమిస్తాను అని తనకి తెలుసు. అలాగే జరిగింది కూడా. ఆ సమయంలో ఉన్న ఎంతో మంది ప్రముఖుల భవిష్యత్తు గురించి ఆయన చెప్పారు.
అలాగే చెరో తన ఆటోబయోగ్రఫీ కూడా రాశారు. అందులో తన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాల గురించి అలాగే ఎంతో మంది ప్రముఖులతో తాను ఇచ్చిన ఇంటర్వ్యూల గురించి కూడా రాశారు. ఈ సినిమా ట్రైలర్ లో కూడా ప్రభాస్ ఇలాగే అంటూ ఉంటారు. తనకి ప్రేమ, పెళ్లి లాంటి రిలేషన్ షిప్ అంటే నమ్మకం లేదు అని అంటారు. కానీ తర్వాత పూజా హెగ్డేతో ప్రభాస్ ప్రేమలో పడతారు.
దాంతో ఈ సినిమా స్టోరీ నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించారు అనే వార్త మాత్రం వస్తోంది. క్లైమాక్స్ కూడా హ్యాపీగా ఉండదు అని, చివరి 20 నిమిషాలు ప్రేక్షకులకి చాలా షాకింగ్ గా అనిపిస్తాయి అని సమాచారం. సినిమా పోస్టర్స్, పాటలు, వీడియోస్ లో కూడా ఈ విషయానికి సంబంధించి చిన్న చిన్న హింట్స్ కూడా ఇస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే విడుదల అయ్యేంత వరకు ఆగాల్సిందే.
End of Article