“రాధే శ్యామ్” ఫస్ట్ రివ్యూ..! అంటే సినిమా ఇలాగే ఉండబోతోందా..? రివ్యూలో ఏం చెప్పారంటే..?

“రాధే శ్యామ్” ఫస్ట్ రివ్యూ..! అంటే సినిమా ఇలాగే ఉండబోతోందా..? రివ్యూలో ఏం చెప్పారంటే..?

by Mohana Priya

Ads

ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమా రాధే శ్యామ్ గురించి అభిమానులు దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. భారతదేశం అంతటా కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Video Advertisement

ఈ సినిమాలో విక్రమాదిత్య అనే పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. ప్రేరణ అనే పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించడం ఇదే మొదటిసారి. రాధే శ్యామ్ సినిమా బృందమంతా సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. ఇటీవల ఈ సినిమా రెండవ ట్రైలర్ కూడా విడుదల అయ్యింది.

radhe shyam review by umair sandhu

దీంతో ఈ సినిమాపై ఆసక్తి ఇంకా పెరిగింది. రాధే శ్యామ్ సినిమాలో కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి అని ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అలాగే అంతకుముందు విడుదల చేసిన రాధే శ్యామ్ ట్రైలర్, లేదా సినిమాకి సంబంధించిన వేరే వీడియోల్లో కనిపించని కొంత మంది నటులు కూడా ఇందులో కనిపించారు. ఇదిలా ఉండగా ఈ సినిమా మొదటి రివ్యూ వచ్చేసింది. ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు ఈ సినిమా చూసి తన రివ్యూ చెప్పారు.

radhe shyam review by umair sandhu

సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా రివ్యూని ఉమైర్ సంధు చెప్పారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఉమైర్ సంధు ఈ విధంగా రాసారు. “రాధే శ్యామ్ ఒక నిజమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాలో మిస్టరీ, రొమాన్స్, యాక్షన్, థ్రిల్ అన్నీ ఉన్నాయి. ఇది ఒక పవర్ ప్యాక్డ్ సినిమా. ప్రభాస్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు. ఈ సినిమా తన వన్ మ్యాన్ షో” అని రాశారు. ఇటీవల భీమ్లా నాయక్ సినిమాకి కూడా ఉమైర్ సంధు ఇలాగే పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. సినిమాకి కూడా సూపర్‌హిట్ టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే సూపర్‌హిట్ అవుతుందేమో అని అంటున్నారు నెటిజన్లు.


End of Article

You may also like