Ads
రజనీకాంత్ హీరోగా, జ్యోతిక హీరోయిన్ గా నటించిన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది రీమేక్ సినిమా అయినా కూడా, తెలుగులో రిలీజ్ అయిన డబ్బింగ్ సినిమా అయినా కూడా, దీనికంటూ ఒక స్పెషల్ రికార్డ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు ఇలాంటి సినిమాకి సీక్వెల్ గా చంద్రముఖి 2 సినిమా రూపొంది ఇవాళ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : చంద్రముఖి 2
- నటీనటులు : రాఘవ లారెన్స్, మహిమా నంబియార్, కంగనా రనౌత్.
- నిర్మాత : సుభాస్కరన్
- దర్శకత్వం : పి వాసు
- సంగీతం : ఎం ఎం కీరవాణి
- విడుదల తేదీ : సెప్టెంబర్ 28, 2023
స్టోరీ :
రాధిక కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వారి సమస్యలని తీర్చడానికి పండితుడు (రావు రమేష్) వస్తాడు. వారికి అనుకోకుండా మదన్ (లారెన్స్) కలుస్తాడు. రాధిక కుటుంబం ఒక గుడిని బాగు చేయించాలి అనుకుంటూ ఉంటారు. మరొక పక్క ఒక అమ్మాయి (మహిమా నంబియార్) వెట్టయన్ రాజు (ఇంకొక లారెన్స్) కోటలో ఏం ఉందో తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటుంది. ఆ అమ్మాయికి మదన్ సహాయం చేస్తూ ఉంటాడు.
అయితే మదన్ కి మాత్రం, ఆ కోటలో ఉన్న దక్షిణం వైపు ఉన్న గదిలో ఏదో ఉన్నట్టు అనుమానం వస్తుంది. తర్వాత అక్కడ ఉన్నది చంద్రముఖి (కంగనా రనౌత్) అని, ఆమె ఆత్మ ఆ ఇంట్లో ఉన్న ఒకరిని ఆవహించింది అని అర్థం అవుతుంది. అసలు చంద్రముఖి ఎవరు? వెట్టయన్ రాజుకి ఆమెకి మధ్య ఉన్న గొడవ ఏంటి? ఆమె ఎలా చనిపోయింది? ఆమె ఆత్మ ఎవరిని ఆవహించింది? ఇదంతా మదన్ ఎలా కనిపెట్టాడు? ఆ సమస్యలను ఎలా పరిష్కరించాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ప్రేక్షకుల మైండ్ లో అలా నిలిచిపోతాయి. తర్వాత ఆ సినిమాకి సంబంధించిన విషయం మరొక సినిమాలో ఏదైనా ఉంది అని తెలిస్తే అది ఏదో పర్సనల్ విషయంగా ఫీల్ అవుతారు. “మా సినిమాని పాడు చేయరు కదా?” అని అనుకుంటారు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ వస్తున్నా కూడా చాలా మంది ప్రేక్షకుల్లో ఇలాంటి ఆలోచనలే ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ చాలా బాగుంటుంది.
ఆ ఫీల్ అయితే ఈ సినిమా పోగొట్టదు కదా అని అనుకున్నారు. డైరెక్టర్ ఒకరే. అయినా కూడా ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే తెలిసిన కథే అయినా కూడా ఒక ట్విస్ట్ యాడ్ చేశారు. అయితే, చంద్రముఖికి, చంద్రముఖి 2 కి మధ్యలో హారర్ కామెడీ పేరుతో చాలా సినిమాలు వచ్చాయి. ఒక కోట, ఆ కోటలో ఒక ఆత్మ, ఆ ఆత్మకి ఒక కోరిక, ఆమెకి ఒక ఫ్లాష్ బ్యాక్, ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి.
దాంతో ఎంత చంద్రముఖి సినిమాకి సీక్వెల్ అయినా కూడా, ఈ సినిమా చూస్తుంటే కొత్తగా ఏమీ అనిపించదు. అంతే కాకుండా మొదటి పార్ట్ లో ఉన్నది అసలు చంద్రముఖి కాదు అని, గంగ చంద్రముఖి ఉన్నట్టు ఊహించుకుంది అని, ఇప్పుడు వచ్చిన చంద్రముఖి అసలు చంద్రముఖి అని చెప్తారు. ఆ పాయింట్ మాత్రం కాస్త ఎక్కదు. సినిమా మొదటి పార్ట్ కి కొనసాగింపు అయినా కూడా ఒక్క వడివేలు పాత్ర తప్ప మిగిలిన ముఖ్య పాత్రలు ఈ సినిమాలో కనిపించరు.
మధ్యలో పూజ చేయడానికి వచ్చిన మనోబాల పాత్ర కూడా ఈ సినిమాలో ఉంది. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, నటీనటులు అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టుగా చేశారు. రజినీకాంత్, జ్యోతిక పాత్రలతో పోల్చకుండా చూస్తే రాఘవ లారెన్స్, కంగనా కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు. కానీ ఒకవేళ పోలిస్తే మాత్రం జ్యోతిక క్రియేట్ చేసిన ప్రభావం కంగనా క్రియేట్ చేయలేకపోయారు ఏమో అనిపిస్తుంది. పాటలు చాలా బాగున్నాయి అనలేము, అలా అని బాగాలేదు అని కూడా అనలేము.
అలా వెళ్ళిపోతాయి అంతే. రారా పాట విషయంలో మాత్రం ఇంకా జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. అసలు ఒరిజినల్ పాటని అలాగే ఉంచి ఉన్నా కూడా బానే ఉండేది ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ ఆ పాట. అందుకే ఈ పాట విన్నప్పుడు ఇది కాస్త కొత్తగా అనిపిస్తుంది. కామెడీ వర్క్ అవుట్ అవ్వలేదు. యాక్షన్ పర్వాలేదు. కానీ మొదటి చంద్రముఖిలో ఇంత భారీ బడ్జెట్ సీన్స్ ఉండవు.
ఇంత కాస్ట్లీ గ్రాఫిక్స్ కూడా ఉండదు. ఇంతమంది భారీ తారాగణం, ఇంత గొప్ప కాస్ట్యూమ్స్ కూడా లేవు. ఆ విషయాలు అన్నిటిలో కూడా ఈ సినిమా ముందు ఉంది. మంచి గ్రాఫిక్స్, డిజైనర్ కాస్ట్యూమ్స్, కలర్ ఫుల్ గా ఉన్న సినిమాటోగ్రఫీ, చాలా మంది నటీనటులు. కానీ అందులో ఉన్న మ్యాజిక్ మాత్రం ఈ సినిమాలో లేదు ఏమో అనిపిస్తుంది. అంతా బాగున్నా కూడా సినిమా ముందుకు వెళుతున్న కొద్ది ఆసక్తికరంగా అనిపించదు. ఏదో మిస్ అయినట్టే అనిపిస్తూ ఉంటుంది.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటులు
- కాస్ట్యూమ్స్
- సెట్టింగ్స్
- క్లైమాక్స్ లో వచ్చే సీన్స్
మైనస్ పాయింట్స్:
- కథలో లోపించిన కొత్తదనం
- మిస్ అయిన మొదటి పార్ట్ మ్యాజిక్
- కామెడీ పేరుతో వచ్చే కొన్ని సీన్స్
- అనవసరమైన చోట్ల వచ్చే పాటలు
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్ :
ఒరిజినల్ తో పోల్చకుండా, రొటీన్ గా ఉన్నా కూడా పర్వాలేదు, అసలు ఈ చంద్రముఖిని ఎలా చూపించారు అని తెలుసుకుందాం అని చూడాలి అనుకుంటే చంద్రముఖి 2 సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : “అఖండ”లో ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు..? అసలు హీరోయిన్ ఏం చేసింది..?
End of Article