సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా లారెన్స్‌ ‘రుద్రుడు’.. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌..

సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా లారెన్స్‌ ‘రుద్రుడు’.. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌..

by Sunku Sravan

Ads

రాఘవ లారెన్స్ కు త‌మిళంతో పాటు తెలుగు ఇండ‌స్ట్రీలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటు కొరియోగ్రాఫర్‌గానే కాకుండా అటు నటుడిగా కూడా రాఘవ లారెన్స్ ప్రేక్షకులను మెప్పించారు. ముని సినిమాతో తనలో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రాన్ని కూడా తీయగల నైపుణ్యం కూడా ఉందని చూపించిన లారెన్స్.. హారర్ థ్రిల్లర్ సినిమాలు చేయడంలో సిద్ధహస్తుడు.

Video Advertisement

యాక్షన్ సినిమాలు కూడా అద‌ర‌కొడతాడు.. ఆయన సినిమాల కోసం ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తుంటారు ఆయ‌న అభిమానులు. కాగా.. కథిరేసన్ దర్శకత్వంలో ఆయన తాజా సినిమా ‘రుద్రుడు’, కాగా.. ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేక‌ర్స్. ‘దెయ్యాలు పుట్టవు .. సృష్టించబడతాయి’ అనే బేస్ లైన్, సినిమాపై ఆసక్తిని పెంచేదిలా ఉంది. కథిరేసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను.. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Image

ఈ సినిమాలో లారెన్స్‌ సరసన ప్రియా భవాని శంకర్ నటిస్తోంది. శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. గతంలో కూడా కాంచన సినిమాలో శరత్‌ కుమార్‌ నటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా 90 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. మరికొన్ని రోజుల్లో షూటింగు పార్టును పూర్తిచేసుకోనుంది.

 


End of Article

You may also like