డ్రగ్స్ కేసు: వైద్యులకు షాక్ ఇచ్చిన హీరోయిన్…యూరిన్ శాంపిల్ అడిగితే ఏం చేసిందంటే?

డ్రగ్స్ కేసు: వైద్యులకు షాక్ ఇచ్చిన హీరోయిన్…యూరిన్ శాంపిల్ అడిగితే ఏం చేసిందంటే?

by Mohana Priya

Ads

కన్నడ సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం నడుస్తున్న టాపిక్ డ్రగ్స్. సెప్టెంబర్ 3వ తేదీన నటి రాగిణి ద్వివేది కి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిఐ) పోలీసులు సమన్లు జారీ చేశారు. కానీ సిసిఐ పంపించిన నోటీసులకు రాగిణి ద్వివేది స్పందించకుండా ఆమె తరపున లాయర్లను పంపి సోమవారం వరకు సమయం కావాలని కోరారు. ఆమె రిక్వెస్ట్ ని పోలీసులు తిరస్కరించారు.

Video Advertisement

 

సెప్టెంబర్ నాలుగవ తేదీ న డ్రగ్స్ పెడ్లింగ్‌ కి సంబంధించి జ్యుడిషియల్ లే అవుట్ యలహంక్ లో ఉన్న‌ రాగిణి ద్వివేది ఇంటిపై మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్ తో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దాడి చేసింది. ఆమె ఇంటి ప్రాంగణం మొత్తం పరిశోధించిన తర్వాత రాగిణి ద్వివేది ని సిసిఐ అదుపులోకి తీసుకుంది. రాగిణి ద్వివేది స్నేహితుడు రవి శంకర్ ని పోలీసులు విచారించిన తర్వాత రాగిణి ద్వివేది ని అరెస్ట్ చేశారు. ఇటీవల నటి సంజన గల్రానీ ని కూడా డ్రగ్స్ కేసు విషయంలో అరెస్ట్ చేశారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రస్తుతం వీరిద్దరినీ విచారిస్తున్నారు.

 

 

సమయం కథనం ప్రకారం విచారణలో భాగంగా డోప్ టెస్ట్ కోసం వీరిద్దరిని బెంగుళూరులో ఉన్న కే పీ జనరల్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. డోప్ టెస్ట్ కి యూరిన్ శాంపిల్స్ ఇవ్వమని చెప్పారట. రాగిణి ద్వివేది ఇచ్చిన యూరిన్ శాంపిల్ లో నీళ్లు ఉన్నాయట. ఇది గమనించిన వైద్యులు, మరోసారి యూరిన్ శాంపిల్ తీసుకొని టెస్ట్ చేస్తున్నారట.

సంజన గల్రానీ కూడా యూరిన్ శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించారట. తాను ఏ తప్పు చేయలేదని, డోప్ టెస్ట్‌ కి అంగీకరించాల్సిన అవసరం లేదు అని పోలీసులతో చాలాసేపటి వరకు వాదించారట సంజన. మాదక ద్రవ్యాల సరఫరా దారులు వీరేన్ ఖన్నా, రాహుల్‌‌ లను విచారణ చేస్తే డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులతో సంజన కి సంబంధాలు ఉన్నాయని, సంజన రేవ్ పార్టీలకు వెళ్ళినప్పుడు డ్రగ్స్ తీసుకుంటారు అని చెప్పారట.


End of Article

You may also like