ఉద్యోగుల్ని ఇంటికి పంపించేసిన మైండ్‌స్పేస్ బిల్డింగ్ 20లో ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలుసా..?

ఉద్యోగుల్ని ఇంటికి పంపించేసిన మైండ్‌స్పేస్ బిల్డింగ్ 20లో ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలుసా..?

by Sainath Gopi

Ads

భారత్ లో ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 31కి చేరింది. అయితే గడిచిన మూడు రోజుల్లోనే 25కేసులు నమోదవడం గమనార్హం . వైరస్ సోకినవారిలో 16మంది ఇటలీ టూరిస్టులే. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వాళ్ల సంఖ్య 90వేల 893కు చేరింది , ఇందులో చైనాలోనే 80 వేల మందికి పైగా హాస్పటల్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3వేల 110 మంది. 20కిపైగా దేశాల్లో ఇప్పుడు కరోనా వైరస్ సోకినట్లు సమాచారం.

Video Advertisement

హైదరాబాద్ లో కూడా ఒక టెక్కీ ఈ వ్యాధి భారిన పడ్డారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉంది అని వైద్యులు తెలిపారు. దుబాయ్ నుండి బెంగళూరు వెళ్లి…అక్కడి నుండి హైదరాబాద్ వచ్చారు ఆ టెక్కీ. అతనిని కలిసిన 85 మందిని కూడా టెస్ట్ చేసారు. కరోనా నెగటివ్ రావడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

ఇక కరోనా దెబ్బకు ఓ ఆఫీస్ వారు ఉద్యోగుల్ని ఇంటికి పంపించేశారు అనే వార్త వైరల్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఓ టెక్కీకి కరోనా అంటూ…ఆమె ఇటలీ నుండి వచ్చారని, ఆమెకి కరోనా సోకింది అని ఆ కంపెనీ తెలిపింది. వెంటనే ఆమెను గాంధీకి తరలించారు. తర్వాత ఆమెకు కరోనా నెగటివ్ అని తేలింది.

మైండ్‌స్పేస్ బిల్డింగ్ నంబర్ 20లో ఉన్న డీఎస్‌ఎం కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా ఐటీ ఉద్యోగినికి కరోనా పాజిటివ్‌ అని ఆ కంపెనీ నోటీసు ఇవ్వడంతో ఆ బ్లాక్‌లోని ఉద్యోగులంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. తర్వాత కరోనా నెగిటివ్ అని తేలడంతో ఐటీ ఉద్యోగులు ఊపిరిపీల్చుకున్నారు. ఇటలీ నుంచి వచ్చిన 30 ఏళ్ల ఐటీ మహిళా ఉద్యోగినికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తీవ్ర ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

ఇక ఆ కంపెనీ అలా నోటీసు ఇవ్వడంతో మైండ్‌ స్పేస్‌లోని ఐటీ కంపెనీలన్నీ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోం’ కూడా ఇచ్చింది అనే వార్త వచ్చింది. కొన్ని కంపెనీలు ఆఫీసులకు హాజరుకావాలని చెప్పడంతో ఉద్యోగులు మాస్కులు ధరించి యధావిధిగా విధులకు హాజరయ్యారు. డీఎస్‌ఎం కంపెనీ మాత్రం మూసివేయగా రహేజా మైండ్‌స్పేస్ బిల్డింగ్‌ 20లో ఉన్న ఇతర కార్యాలయాలకు ఉద్యోగులు యధావిధిగా హాజరయ్యారు. మైండ్‌స్పేస్ బిల్డింగ్‌లో ఎటువంటి వైరస్‌లు వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వైరస్ వ్యాప్తి చెందకుండా స్ప్రే చేస్తున్నారు.


End of Article

You may also like