బలవంతంగా పదేళ్లపాటు బంధించాడు అని ఆరోపణ.! అసలు ట్విస్ట్ ఏంటంటే.?

బలవంతంగా పదేళ్లపాటు బంధించాడు అని ఆరోపణ.! అసలు ట్విస్ట్ ఏంటంటే.?

by Mohana Priya

ఒక వ్యక్తి తన ప్రేయసిని 10 సంవత్సరాల పాటు ఒకే గదిలో బంధించాడు అని ఆరోపణలు ఎదుర్కొన్నారు. కానీ ఈ ఘటనకు సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయం ఒకటి ఇటీవల వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, న్యూస్ 18 తెలుగు కథనం ప్రకారం రెహమాన్, సజిత అనే ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. 2010లో సజిత తన ఇంటి నుండి బయటికి వచ్చేశారు. అప్పుడు తనకి 18 సంవత్సరాలు. రెహమాన్ ఎలక్ట్రిక్ పెయింటింగ్ వర్క్ చేసేవారు. దాంతో రెహమాన్ ఎవరికి తెలియకుండా సజితని పది సంవత్సరాలపాటు ఒకచోట ఉంచారు.

Video Advertisement

Rahman sajitha love story kerala

తర్వాత ఈ సంవత్సరం వితనస్సేరి లోని ఒక ఇంట్లోకి మారారు. రెహమాన్ ఆచూకీ కనిపించడం లేదు అని రెహమాన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో కూడా ఎటువంటి ఆధారాలు లభించలేదు. తర్వాత రహమాన్ సోదరుడు నేన్మారాలో అతని ఆచూకీ గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రెహమాన్ ని అదుపులోకి తీసుకున్నారు.

Questions to ask before marriage

representative image

మొదట రెహమాన్ సజితని  బలవంతంగా బంధించారు అని అనుకున్నారు కానీ వారిద్దరూ కలిసి ఉంటున్నామని చెప్పారు. తాము చట్ట ప్రకారం పెళ్లి చేసుకోలేదు, సహజీవనం చేస్తున్నామని చెప్పారు. సజిత కూడా రెహమాన్ ని ప్రేమిస్తున్నాను అని చెప్పడంతో ఈ కేస్ మూసివేశారు. ఇటీవల వారిద్దరూ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ విషయంపై రెహమాన్ మాట్లాడుతూ అధికారిక వివాహం వారిని కాపాడుతుంది అని తమకు తెలుసు అని, ఇప్పుడు తాము సంతోషంగా ఉన్నామని, అలాగే సురక్షితంగా ఉన్నట్టు భావిస్తున్నామని చెప్పారు.


You may also like