Ads
ప్రస్తుతం ప్రపంచంగా వ్యాప్తంగా వణికిస్తున్న వైరస్ కరోనా. మన దేశంలో కరొనను తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంలో ఆలస్యం జరిగింది అని రాహుల్ గాంధీ అభిప్రాయపడుతున్నారు. కరోనాను నియంత్రించే క్రమంలో మనకు తగినంత సమయం ఉన్నా సరిగ్గా వ్యవహరించడంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ప్రస్తుతం భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేసారు.
Video Advertisement
కరోనాను పూర్తిగా కట్టడి చేసే అవకాశమున్నా, సీరియస్‌గా తీసుకోలేదని ఆయన మండిపడ్డారు. కరోనాను ఎదుర్కొనేందుకు తక్షణం పటిష్టమైన చర్యలు చేపట్టాలి. లేదంటే భారీ మూల్యం తప్పదు అంటూ గతంలోనే మూడు ట్వీట్ లు చేసారు రాహుల్ గాంధీ. ఫిబ్రవరి రెండవ తేదీన “కరోనా వైరస్ వల్ల భారత్ కు పెద్ద ప్రమాదం ఉంది. ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవట్లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది” అని ట్వీట్ చేసారు. తర్వాత మార్చ్ 3 న మరోసారి హెచ్చరించారు. ఇండియా ఇంకా సీరియస్ తీసుకోవట్లేదు అంటూ మండిపడ్డారు. మార్చ్ 13 న ఆర్ధికంగా చాలా ఇబ్బందులు వస్తాయి నిర్లక్ష్యం పనికిరాదు అంటూ మరోసారి హెచ్చరించారు. ముందే జాగ్రత్త పడుంటే బాగుండేది అని అభిప్రాయపడ్డారు.
End of Article