Home Filmy Adda “తాగి ట్వీట్ చేసావా బ్రో..?” అనే నెటిజన్ ప్రశ్నకి… వైరల్ అవుతున్న రాహుల్ రామకృష్ణ రిప్లై..!

“తాగి ట్వీట్ చేసావా బ్రో..?” అనే నెటిజన్ ప్రశ్నకి… వైరల్ అవుతున్న రాహుల్ రామకృష్ణ రిప్లై..!

by Mohana Priya

“నా వల్లే ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతారా” డైలాగ్స్ తో తనకంటూ కామెడీలో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ఆర్టిస్ట్ రాహుల్ రామకృష్ణ. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రం ద్వారా కమెడియన్ గా తెలుగు సినీ పరిశ్రమలో రాహుల్‌ రామకృష్ణ ఎంట్రీ ఇచ్చాడు.

అతను నటించిన ‘గీత గోవిందం’ ‘బ్రోచేవారెవరురా’ ‘జాతిరత్నాలు’, ‘కల్కి’ మొదలైన సినిమాల ద్వారా నటుడిగా మంచి పేరు,గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్య ‘ఆర్ఆర్ఆర్’ ‘అంటే సుందరానికి’ ‘హ్యాపీ బర్త్ డే’ వంటి చిత్రాల ద్వారా అతను సోషల్ మీడియా లో కూడా బాగా పాపులర్ అయ్యాడు.

5 rahul ramakrishna

ప్రస్తుతం ఇతను చాలా సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా గడుపుతున్న ఈ ఆక్టర్ సోషల్ మీడియా లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటాడు.అప్పుడప్పుడు తన సెన్సేషనల్ ట్వీట్లు తో అతను వైరల్ అవుతుంటాడు. రీసెంట్ గా అతను ‘సినిమా, సాహిత్యం, సంగీతం..’ వీటి గురించి ఏదైనా అడగండి అని స్టార్ట్ చేసిన చిట్ చాట్ సెషన్ కు నెటిజన్లు వెరైటీ క్వశ్చన్స్ అడగడం తో రామకృష్ణ వాటికి గట్టిగా స్పందించారు. లైవ్ చిట్ చాట్ సెక్షన్ లో ’మీకు నచ్చిన వెబ్‌ సిరీస్‌ ఏంటి? అన్న?’ అని నెటిజెన్ అడిగిన ప్రశ్నకు…”బెటర్‌ కాల్‌ సాల్‌’ అని వెంటనే బదులిచ్చాడు.

rahul ramakrishna reply to a netizen in twitter goes viral

‘ఈ మధ్య నీ లెక్క తెలంగాణ మాండలికంలో చాలా తక్కువమంది మాట్లాడుతారు. నువ్వు యాస చాలా స్పష్టంగా మాట్లాడుతావు. దానికి ఏమన్నా హోంవర్క్‌ చేస్తావా భయ్యా? లేక సహజంగానే అంతేనా?’ అన్న మరో నెటిజెన్ ప్రశ్నకు “మాతృభాషకు హోం వర్క్‌ అక్కర్లేదని నా ఫీలింగ్‌’” అంటూ తనదైన కామెడీ యాంగిల్ లో కౌంటర్ ఇచ్చాడు. ఇదిలా ఉండగా ఇంకో నెటిజెన్ అయితే ఏకంగా.. ‘ఎప్పుడైనా తాగేసి ట్వీట్ చేశావా?’ అని బోల్డ్ గా ప్రశ్నించాడు.దీనికి రాహుల్ రామకృష్ణ ఆ నెటిజెన్ తో పాటు అందరి మైండ్ బ్లాక్ అయ్యేలాగా ‘చాలా సార్లు’ అంటూ బదులిచ్చారు.

You may also like