రైల్వే ట్రాక్ పై సెల్ఫీ…పెళ్ళికి పెద్దలు ఒప్పుకోరేమో అని ఆ జంట ఏం చేసారంటే?

రైల్వే ట్రాక్ పై సెల్ఫీ…పెళ్ళికి పెద్దలు ఒప్పుకోరేమో అని ఆ జంట ఏం చేసారంటే?

by Megha Varna

పెళ్లంటే నూరేళ్లు కలిసి జంటగా ఆనందంగా బ్రతకాలని కోటి ఆశలతో పెళ్లి చేసుకుంటారు ..కానీ పెళ్లి అయినా 48 గంటలు దాటకముందే జంటగా ముగింపు పలికేసారు ఈ నవదంపతులు . ఆఖరిసారిగా రైల్వే ట్రాక్ పై సెల్ఫీ తీసుకుని వీడ్కోలు పలికేసారు ..తమిళనాడులో చోటుచేసుకున్న ఈ సంఘటన విషాద ఛాయలు అలముకొంది …పెళ్లి అయినా రెండురోజులకే దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడం అందరి కళ్ళు చెమెర్చేల చేసింది ..

తిరుపత్తూర్‌ జిల్లావాసి అయిన రామదాసుకు పూంగులమ్‌పుదూర్‌కు చెందిన నందిని ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యింది .కూలిపని వృత్తిగా జీవనం సాగిస్తూ ఉండేవాడు రామదాసు. కాగా నందిని ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి …నందిని భర్తకు దూరమైన ఒంటరి మహిళ …విరిద్దరికి ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడి ఇద్దరి మనసులు కలవడంతో అది ప్రేమగా మారింది ..దీంతో ఒంటరిగా జీవనం సాగిస్తున్న నందినికి ఒక తోడుగా ఉండేందుకు రామదాసు సంసిద్దుడయ్యాడు . అదేవిదంగా ఇద్దరు పెళ్లి చేసుకొని ఒకటి అవ్వడానికి నిశ్చయించుకున్నారు ..కానీ వీళ్ళందరూ ఒకటి అవ్వడానికి కులం అడ్డురావడంతో ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు ..

దీంతో వీరి రెండు కుటుంబల మధ్య గొడవలు నెలకొన్నాయి …దీంతో వారి వివాహాన్ని పెద్దలు ఒప్పుకోరని భావించిన విరిద్దరు వీరవర్‌ ఆలయానికి దగ్గరలో వున్నా రైల్వే ట్రాక్ పై చివరిసారిగా సెల్ఫీ తీసుకున్నారు ..ఆత్మహత్య చేసుకున్న కొద్దిసేపటి తర్వాత విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు ..పోస్ట్ మార్టనికి మృత దేహాలని పంపించి ఇంట్రాగేషన్ మొదలుపెట్టారు పోలీసులు.

You may also like