Ads
రాజధాని కోసం అమరావతి రైతుల పోరాటం నేపథ్యంలో వచ్చిన సినిమా రాజధాని ఫైల్స్. తాజాగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఎలక్షన్లు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సంఘటనలతో ముడిపడిన సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. మొన్న యాత్ర 2 రిలీజ్ అయింది కానీ పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఇప్పుడు రాజధాని ఫైల్స్ అంటూ మరొక సినిమా వచ్చింది.
Video Advertisement
ఈ సినిమా ఫిబ్రవరి 15న విడుదలైంది. సినిమా కథ ఏమిటంటే అరుణ ప్రదేశ్ లో కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది స్టేట్లో రాజధానిని ఐరావతిగా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. రాజధాని నిర్మాణం కోసం భూములు కావాల్సి ఉంటుంది. అధికారులు ఊరూరా తిరిగి భూములు సేకరిస్తారు.
రైతు నాయకుడు( వినోద్ కుమార్) ప్రోద్బలం తో రైతులు భూములు ఇచ్చేందుకు ఒప్పుకుంటారు. అయితే రాజధాని నిర్మాణ పనులు జరుగుతూ ఉండగా తర్వాత ఎన్నికలు జరగటం, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం వచ్చిన కొత్త సీఎం ( విశాల్ పట్నీ) నాలుగు రాజధానుల పేర్లని తెరపైకి తీసుకురావడం జరుగుతుంది. గత ప్రభుత్వం స్థాపించిన రాజధానిని మనం పూర్తి చేయటం ఏమిటి అని పీకే సలహా ఇవ్వటంతో రాజధాని పనులు ఆగిపోతాయి రైతులు రోడ్డున పడతారు రైతు నాయకుడి సమక్షంలో నిరసన తెలియజేశారు.
వీరి నిరసనను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వం అరాచకాలను చూసిన రైతు నాయకుడు కొడుకు గౌతమ్ కూడా జనంతో కలుస్తాడు. అయితే పీకేతో కలిసి సీఎం వేసిన ఎత్తుగడలేమిటి? ప్రజల్లో మార్పు తీసుకువచ్చేందుకు ఏం చేశారు? రాజధాని విషయంలో దర్శకుడు ఇచ్చిన పరిష్కారం ఏమిటి అనేది సినిమా. ఈ సినిమాలో పాత్రలు తప్పితే నటులు కనిపించరు. వాణి విశ్వనాథ్ వినోద్ కుమార్ అంత బాగా నటించారు. వారి కుమారుడు గౌతమ్ గా అఖిలన్ నటించాడు.
ముఖ్యమంత్రి,ఎంపీలు, ఎమ్మెల్యేలుగా నటించిన నటులు నిజ జీవితం వ్యక్తుల్ని గుర్తు చేస్తూ ఆ పాత్రలలో మంచి అభినయం ప్రదర్శించారు. పీకే కెమెరా, సంగీతం, కూర్పు అన్ని పర్వాలేదనిపించాయి. ఈ సినిమాకి వాస్తవ నేపద్యం, భావోద్వేగాలు మాటలు నటీనటులు, పతాక సన్నివేశాలు ప్లస్ పాయింట్లు అయితే ఆరంభ సన్నివేశాలు మైనస్ పాయింట్స్. ఇక రేటింగ్ విషయానికి వస్తే సినిమాని రేటింగ్ పేరుతో తక్కువ చేయలేము.
watch trailer :
End of Article