ఆర్.ఆర్.ఆర్. లో “అలియా” పాత్ర ఇదే…జక్కన్న క్లారిటీ!!!

ఆర్.ఆర్.ఆర్. లో “అలియా” పాత్ర ఇదే…జక్కన్న క్లారిటీ!!!

by Megha Varna

Ads

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆ.ర్ .ఆర్ చిత్రం గురించి అంతటా ఆసక్తి నెలకొంది   . ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్స్ తో మంచి రెస్పాన్స్ వచ్చింది.రాజమౌళి మళ్ళీ పక్కాగా ఇంకో ఇండస్ట్రీ హిట్ ఇవ్వడం ఖాయం అని సినీ వర్గాలలో చర్చలు మొదలయ్యాయి .ఎన్టీఆర్ ,రామచరణ్ లాంటి బడా హీరోలతో బారి రేంజ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు చూస్తామా అని సినీ ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు .

Video Advertisement

 

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరీస్ నటిస్తోంది. శరవేంగంగా షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది . ఇలా షూటింగ్ క్యాన్సిల్ అవ్వడం వలన ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని వచ్చే యేడాది ఏప్రిల్ చివరలో ప్రేకక్షుల ముందుకు తీసుకువచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం .

ఈ చిత్రంలో అలియా పాత్ర ఎలా ఉండబోతుందో జక్కన తెలిపారు .ఎన్టీఆర్ ,రాంచరణ్ చాలా స్టార్ డోమ్ ఉన్న యాక్టర్స్ అంతేకాకుండా భారీ స్థాయిలో అభిమానులు ఉన్న హీరోలు.వీరిద్దరి నటన ముందు ఒక యాక్టర్ నిలబడాలంటే అది చాలా కష్టం.అందుకే చాలా అలోచించి అలియాను సెలెక్ట్ చేయమని రాజమౌళి తెలిపారు .ఈ చిత్రంలో అలియా రెండు విభిన్న కోణాలు ఉన్న పాత్ర చేయబోతుంది.రామరాజు మరదలుగా సీత పాత్రలో ప్రేక్షకులకు కనపడనుంది అలియా బట్ .

ఈ పాత్ర ద్వారా అలియా ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంటారని రాజమౌళి తెలిపారు.లాక్ డౌన్ ముగియగానే శరవేగంగా షూటింగ్ మొదలుపెట్టడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది.బాహుబలి లాంటి భారీ హిట్ తర్వాత రాజమౌళి నుండి వస్తున్న చిత్రం కాబట్టి ప్రేక్షకులలో అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.పైగా ముల్టీస్టారర్ చిత్రం కావడంతో ఇరు హీరోల లభిమానులు కూడా చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.అసలు ఈ చిత్రంలో అలియా పాత్ర ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి .


End of Article

You may also like