ఒక వేళ ఇదే లుక్‌తో ఉంటే..? “మహేష్ బాబు” పై రాజమౌళి కామెంట్స్..!

ఒక వేళ ఇదే లుక్‌తో ఉంటే..? “మహేష్ బాబు” పై రాజమౌళి కామెంట్స్..!

by kavitha

Ads

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో సినిమా అనౌన్స్‌ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అయితే ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వర్క్స్ వేగంగా జ‌రుగుతున్నాయి. ఇక ఈసినిమాకి రాజ‌మౌళి తండ్రి విజయేంద్ర ప్ర‌సాద్ క‌థ‌ను రెడీ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వార్తొక‌టి నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Video Advertisement

వివరాల్లోకి వెళ్తే సినిమాల కోసం కథానాయకులు వారి లుక్స్ మార్చడం ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం. దీనికి కారణంఒక్కో సినిమాకు ఒక్కో లుక్‌ లో ఉండాలి అని ఆ సినిమా దర్శకుడు, హీరో అనుకోవడమే.  దీనికి మేకోవర్‌ కూడా. మేకోవర్‌ అంటే బాడీ ఫిట్‌నెస్‌ తో పాటు లుక్‌, హెయిర్ స్టైల్ ఇలా చాలా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి దర్శకధీరుడు రాజమౌళి కూడా అతీతుడు కాదు. రాజమౌళితో సినిమా అనగానే హీరో లుక్‌ ఖచ్చితంగా మారాల్సిందే. కానీ ఇప్పుడు మహేష్ సినిమాకి అలాంటిదేం లేదని అన్నట్టు వినిపిస్తున్నాయి.rajamouli telugu addaరాజమౌళి మహేష్‌బాబుతో మూవీని అనౌన్స్‌ చేసి చాలా రోజులు అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా కేఎల్‌ నారాయణ నిర్మాణంలో రాబోతుంది. అయితే త్రివిక్రమ్‌ మూవీ పూర్తయిన తరువాత ఈ సినిమాను మొదలుపెడతారు. అంటే ఈ సినిమా 2023 చివరలో మొదలు అవుతుందని అనుకుంటున్నారు. రాజమౌళి ఈ సినిమా గురించి తాజాగా చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.ఈ మూవీ కోసం మహేష్‌ బాబు లుక్‌లో మార్పులు చేయడం లేదని రాజమౌళి కామెంట్స్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
Rajmouli-Mahesh-Movie-telugu adda‘ఇండియానా జోన్స్‌’ లాంటి మూవీ చేయాలని ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నానని, అడ్వంచరస్‌ కథల్లో మహేష్‌ కనిపిస్తే బాగుంటుంది. ఎప్పట్నుంచో అలాంటి ఆలోచన ఉందని,  అలాంటి మూవీ చేయడానికి ఇదే సరైన సమయం. అందుకే మహేష్‌ సినిమాను గ్లోబ్‌ ట్రాటింగ్‌ అడ్వంచరస్‌ మూవీగా తీయాలని అనుకుంటున్నానని అన్నారు. ఈ సినిమాకు మహేష్ ఇప్పుడున్న లుక్ సరిపోతుందని జక్కన్న భావిస్తున్నారని సమాచారం.


End of Article

You may also like