Sirivennela Seetharama Sastry: “ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు..?” అంటూ… సిరివెన్నెల గారి గురించి ఎమోషనల్ అయిన రాజమౌళి.!

Sirivennela Seetharama Sastry: “ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు..?” అంటూ… సిరివెన్నెల గారి గురించి ఎమోషనల్ అయిన రాజమౌళి.!

by Mohana Priya

ఎన్నో కావ్యాత్మక పాటలకు ప్రాణం పోసిన సిరివెన్నెల గారి కలం ఇక ఆగిపోయింది అంటే నమ్మలేము. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన అక్షరం మనకి వినిపిస్తూనే ఉంటుంది. ఆయన దూరం అయ్యారని.. ఆ అక్షరమే కన్నీరు కారుస్తోంది. సాహితీ ప్రపంచానికి మరో సిరివెన్నెల దొరకడం ఇక సాధ్యమేనా..?

Video Advertisement

సినీ ప్రపంచానికి ఆయన లోటు తీరనిది. ఆయన రాసిన ప్రతి పాట ఓ అద్భుతమే. ఆయన లేని సాహితి ప్రపంచం ఊహించుకోలేం. సిరివెన్నెల గారి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేసారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి కూడా సిరివెన్నెల గారితో తనకి ఉన్న అనుబంధం గురించి ఒక నోట్ రూపంలో పంచుకున్నారు. ఆ నోట్ లో రాజమౌళి ఈ విధంగా రాసారు, “1996 లో మేము అర్ధాంగి అనే సినిమాతో సంపాదించుకున్న డబ్బు, పేరు మొత్తం పోయింది. వచ్చే నెల ఇంటి అద్దె ఎలా కట్టాలో తెలియని స్థితి.”

rajamouli emotional words about sirivennela seetharama sastry

“అలాంటి పరిస్థితులలో నాకు ధైర్యాన్నిచ్చి, వెన్ను తట్టి ముందుకు నడిపించినవి ‘ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులు కోవద్దురా ఓరిమి’ అన్న సీతారామశాస్త్రి గారి పదాలు… భయం వేసినప్పుడల్లా గుర్తు తెచ్చుకుని పాడుకుంటే ఎక్కడ లేని ధైర్యం వచ్చేది. అప్పటికి నాకు శాస్త్రి గారితో పరిచయం చాలా తక్కువ. మద్రాసులో డిసెంబర్ 31 వ తారీకు రాత్రి 10 గంటలకి ఆయన ఇంటికి వెళ్ళాను. ‘ఏం కావాలి నందీ’ అని అడిగారు. ఒక కొత్త NOTE BOOK ఆయన చేతుల్లో పెట్టి మీ చేతుల్తో ఆ పాట రాసివ్వమని అడిగాను… రాసి, ఆయన సంతకం చేసి ఇచ్చారు…. జనవరి 1 న మా నాన్న గారికి గిఫ్ట్ గా ఇచ్చాను. నాన్న గారి కళ్ళల్లో ఆనందం, మాటల్లో కొత్తగా ఎగదన్నుకొచ్చిన విశ్వాసం ఎప్పటికీ మర్చిపోలేను…,”

rajamouli emotional words about sirivennela seetharama sastry

 

“సింహాద్రి లో “అమ్మయినా నాన్నయినా, లేకుంటే ఎవరైనా’ పాట…, మర్యాద రామన్న లో ‘పరుగులు తియ్’ పాట, ఆయనకి చాలా ఇష్టం… “అమ్మ నాన్న లేకపోతే ఎంత సుఖమో అని కానీ, పారిపోవటం చాలా గొప్ప అని కానీ ఎలా రాస్తాము నంది” అని తిట్టి, మళ్ళీ ఆయనే “ I LIKE THESE CHALLENGES (నాకు ఈ సవాళ్ళు అంటే ఇష్టం)” అంటూ మొదలు పెట్టారు. కలిసినప్పుడల్లా ప్రతీ లైన్ నెమరువేసుకుంటూ, అర్ధాన్ని మళ్ళీ విపులీకరించి చెప్తూ, ఆయన స్టైల్ లో గది దద్దరిల్లేలా నవ్వుతూ, పక్కనే ఉంటే వీపుని గట్టిగా చరుస్తూ ఆనందించేవారు…”

sirivennela

 

“RRR లో దోస్తీ MUSIC VIDEO (మ్యూజిక్ వీడియో) కి LYRIC PAPER (లిరిక్ పేపర్) లో ఆయన సంతకం చేసే షాట్ తీద్దామని చాలా ప్రయత్నించాము.. కానీ అప్పటికే ఆరోగ్యం సహకరించక కుదర్లేదు. IT WOULD HAVE BEEN A GREAT MEMORY (అది ఒక గొప్ప జ్ఞాపకంలా ఉండిపోయేది ). నా జీవన గమనానికి దిశా నిర్దేశం చేసిన సీతారామశాస్త్రి గారి కలానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ… రాజమౌళి.” అని రాసారు.


You may also like