రాజమౌళి నీ సినిమాలన్నీ కాపీ అంటూ యంగ్ డైరెక్టర్ సంచలన ట్వీట్.!

రాజమౌళి నీ సినిమాలన్నీ కాపీ అంటూ యంగ్ డైరెక్టర్ సంచలన ట్వీట్.!

by Megha Varna

Ads

రాజమౌళి …ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది పక్క సక్సెస్ ..పరాజయం తెలియని దర్శకుడు ..తెలుగు సినిమా గురించి చులకనగా మాట్లాడుకునే బాలీవుడ్ వాళ్ళని కూడా జయహో రాజమౌళి అని ప్రశంసించేలా చేసిన దర్శకుడు రాజమౌళి ..ప్రభాస్ హీరో గా తీసిన బాహుబలి చిత్రంతో జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయంగా కూడా తెలుగు సినిమా కు గుర్తింపు తీసుకు వచ్చిన ఘనత మాత్రం రాజమౌళి దే.

Video Advertisement

తెలుగులో ఇంత విజన్ ఉన్న దర్శకులు ఉన్నారా అనే అంతలా  గుర్తింపు పొందాడు దర్శక ధీరుడు రాజమౌళి .అలంటి రాజమౌళి దర్శకత్వం గురించి ఒక చిన్న కామెంట్ చేయడానికి కూడా ఎవరు సాహసించరు .పైగా వివాదాలకు చాలా దూరంగా ఉంటాడు రాజమౌళి ..తన విషయం తాను చూసుకుంటాడు గాని ఎవరి మీద ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యడు. అలాంటి రాజమౌళి పై ఓ కొత్త దర్శకుడు సంచలన వ్యాఖ్యలు చేసాడు ..వివరాల్లోకి వెళ్తే ..

నీ సినిమాలన్నీ కాపీ ..ఒరిజినాలిటీ లేని దర్శకుడు నువ్వు అంటూ సంచలన కామెంట్స్ చేసాడు ..ఒకే ఒక్క సినిమా తీసిన అనుభవం ఉన్న దర్శకుడు పైగా డిజాస్టర్ సినిమా ఇచ్చిన దర్శకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు .ఈ వివాదం ఎలా మొదలైంది అంటే ఆస్కార్ విన్నింగ్ సినిమా పారాసైట్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు రాజమౌళి ..ఈ సినిమా చూస్తుంటే తనకు నిద్ర వచ్చేసిందని ..అసలు తనకు నచ్చలేదని ..నాకు ఎక్కేలేదని చెప్పాడు ..మధ్యలో పడుకున్నానని …ఆ తర్వాత తన భార్య కథ చెప్పిన కూడా అసలు నచ్చలేదని చెప్పాడు రాజమౌళి ..

దీంతో ఈ వ్యాఖ్యలు కాస్త వివాదం అయింది..నాలుగు ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న ఒరిజినల్ సినిమా మీకు నచ్చలేదా అంటూ కొంతమంది రాజమౌళిని విమర్శించారు.అయితే అన్ని సినిమాలు అందరికి నచ్చావ్ అని ఎవరి టేస్ట్ వాళ్ళకి ఉంటుంది అని నాకు నచ్చనంత మాత్రాన అది గొప్ప సినిమా కాకుండాపోదని వివరణ ఇచ్చాడు రాజమౌళి .తన అభిరుచికి  తగిన సినిమా కాదని చెప్పాడు .అయితే రాజమౌళి కామెంట్స్ పై ఓ కుర్ర దర్శకుడు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు ..గత ఏడాది ప్రియదర్శి ,రాహుల్  రామకృష్ణ హీరోగా మిఠాయి సినిమా తెరకెక్కించిన ప్రశాంత్ కుమార్ సంచలన లేఖ రాసాడు ..రాజమౌళిని విమర్శిస్తూ ఈయన ట్వీట్ చేసాడు ..

పారాసైట్ అనేది ఒక గొప్ప ఒరిజినాలిటీ ఉన్న చిత్రం ..ఈ చిత్రాన్ని ప్రపంచ ప్రఖ్యాత దర్శకుల మన్ననలు పొందింది .కాగా బహుబాలి గురించి ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు మాట్లాడడం నేనెక్కడ వినలేదని ..చూడలేదని ..ఒరిజినాలిటీ గురించి మాట్లాడుకుంటే మీ సై సినిమాలో ఓ సీన్ మొత్తాన్ని కాపీ చేసారు ..మరికొన్ని సినిమాలు కూడా కాపీలే ..అలాంటిది ఒరిజినల్ సినిమా అయిన పారాసైట్ గురించి ఇలాంటి కామెంట్స్ చేయడం మీకు తగదు అంటూ ప్రశాంత్ కుమార్ ట్వీట్ చేసాడు.తీసింది ఒక్క సినిమా పైగా అది డిజాస్టర్ కాబట్టి తనను ఎవరు పట్టించుకోరు ..కాగా అతడు ఇలాంటి కామెంట్స్ చేసి పబ్లిసిటీ తెచ్చుకుందాం అనే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చెసుంటాడని నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు .అయిన ఇంత గొప్ప చిత్రం అయిన అందరికి నచ్చాలని లేదు .. కొంతమందికి  నచ్చుతుంది ..కొంతమందికి నచ్చదు ..ఆలా నచ్చకపోయినంత మాత్రాన విమర్శలు చేయడం సరైన పద్దతి కాదు అని ప్రశాంత్ కుమార్ కు కొంతమంది సలహాలు ఇస్తున్నారు ..


End of Article

You may also like