“రాజమౌళి” సరదాగా అన్న విషయం ఇప్పుడు నిజమయ్యిందా..? వైరల్ అవుతున్న ఇంటర్వ్యూ..!

“రాజమౌళి” సరదాగా అన్న విషయం ఇప్పుడు నిజమయ్యిందా..? వైరల్ అవుతున్న ఇంటర్వ్యూ..!

by Mohana Priya

Ads

ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?

Video Advertisement

వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి. అయితే ఈ సినిమాలో అంత పెద్ద స్టార్ హీరోలు కలిసి నటించడం అనేది సినిమా క్రేజ్ ఇంకా పెంచింది.

highlights in rrr movie

ఈ జనరేషన్ లో అంత పెద్ద స్టార్ హీరోలు కలిసి నటించడం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటిది రాజమౌళి ఇలాంటి సాహసం చేశారు అంటే సినిమా ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. రాజమౌళి వీరిద్దరితో కూడా సినిమాలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ సినిమాలు, అలాగే రామ్ చరణ్ తో మగధీర సినిమా చేశారు రాజమౌళి. ఈ నాలుగు సినిమాలు కూడా రికార్డ్స్ నెలకొల్పాయి. దాంతో వారిద్దరితో రాజమౌళికి చాలా మంచి అనుబంధం ఉంది.

highlights in rrr movie

అయితే రాజమౌళి అంతకుముందు ఒక సందర్భంలో తెలిసీ తెలియకుండా ఈ సినిమా గురించి మాట్లాడారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో రాజమౌళి అతిథిగా వచ్చారు. ఈ ప్రోగ్రాంలో ఆర్కే మాట్లాడుతూ రాజమౌళిని “ఒక మల్టీ స్టారర్ తీసే ఆలోచన ఏమైనా ఉందా?” అని అడిగారు. అందుకు రాజమౌళి, “మల్టీస్టారర్ సినిమా తీయాలని అయితే ఉంది” అన్నట్టుగా సమాధానం చెప్పారు. అప్పుడు ఆర్కే మాట్లాడుతూ, “జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిపి ఒక సినిమా తీయొచ్చు కదా? మీరు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళిద్దర్నీ కలిసి సినిమా తీయొచ్చు” అని అన్నారు. అప్పుడు ఆ విషయం సరదాకి అన్నా కూడా ఇప్పుడు అదే నిజమైంది.

Watch video :

https://www.instagram.com/reel/CbfZbSHpHxJ/?utm_medium=copy_link


End of Article

You may also like