RRR: ఆర్ ఆర్ ఆర్ సినిమాలో తారక్ రోల్ అంతేనా..? ఇదేంటి రాజమౌళి గారు..?

RRR: ఆర్ ఆర్ ఆర్ సినిమాలో తారక్ రోల్ అంతేనా..? ఇదేంటి రాజమౌళి గారు..?

by Megha Varna

Ads

అభిమానులు ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దాదాపుగా 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో దర్శకుడు రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఎన్నో అప్డేట్స్ రావడంతో పాటుగా వివిధ రకాల గాసిప్స్ కూడా రావడం జరుగుతోంది. తాజాగా వచ్చిన గాసిప్ ని చూస్తే..

Video Advertisement

ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్ కేవలం అరగంట మాత్రమే కనిపిస్తాడని సోషల్ మీడియాలో రూమర్లు వినపడుతున్నాయి. కేవలం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత రాజమౌళి ఇచ్చారని… ఎన్టీఆర్ కి ఇవ్వలేదని జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై రాజమౌళి స్పందించి ఆర్ఆర్ సినిమాలో తారక్ ని కేవలం అరగంట మాత్రమే చూపిస్తే అభిమానులు ఊరుకుంటారా..? అని ప్రశ్నించారు రాజమౌళి.

ఈ చిత్రంలో ఎవరు ఎంత సేపు కనిపిస్తారని వివరాలు ఇప్పుడు చెప్పడం సరైనది కాదని రాజమౌళి అన్నారు. అదే విధంగా ఆయన పలు విషయాలను కూడా షేర్ చేసుకోవడం జరిగింది. తనకి శాంతినివాసం సీరియల్ షూటింగ్ సమయంలో డైరెక్టర్ అవుతానని అనిపించిందని.. డైరెక్టర్ ని కాకపోతే నేను డ్రైవర్ ని అయ్యే వాడిని అని రాజమౌళి అన్నారు. అయితే తగిన ప్రయాణం ద్వారా మాత్రమే ఎవరైనా ఏ రంగంలో అయినా సక్సెస్ అవుతారని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.


End of Article

You may also like