Ads
రాజమౌళి గురించి కొత్తగా ఏమని చెప్పాలి..? ఎంతని చెప్పాలి…? మన దేశమే కాదు రాజమౌళి గురించి ప్రపంచమే మాట్లాడుకుంటోంది. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఎంత సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే.
Video Advertisement
ఈ సినిమా కి వివిధ దేశాల్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి 1200 కోట్ల రూపాయలకు పైగా వసూల్ చేసింది. ఇది మాములు విషయమా..?
బాహుబలి తో రాజమౌళికి మంచి పేరు వచ్చిందంటే.. దాని కంటే మరో పెద్ద సినిమా ఆర్ ఆర్ ఆర్ ని తీసి రాజమౌళి మరో మెట్టు ఎక్కేసాడు. జపాన్ లో విడుదలైన ఈ చిత్రం మంచి కలెక్షనలతో దూసుకుపోతోంది. ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఇండివిడ్యుయల్ గా ఆస్కార్ అవార్డు కోసం అప్లై చేసింది కాంపెయిన్ స్టార్ట్ చేసింది. రాజమౌళి RRR ఆస్కార్ మరియు గోల్డెన్ గ్లోబ్స్ క్యాంపైన్ కోసం రూ. 83 కోట్ల ని ఖర్చు చేశారట ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ చిత్రం సీక్వెల్ గురించి కూడా రాజమౌళి అనౌన్స్ చేసారు. రాజమౌళి సీక్వెల్ గురించి అనౌన్స్ చేయడం తో అభిమానుల్లో ఆసక్తి బాగా పెరిగింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల అయినపుడు అంతా కూడా ఈ మూవీ కి సీక్వెల్ ఉంటే బావుంటుందని అనుకున్నారట. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. ఆ విషయమే చెప్పారు రాజమౌళి.
కానీ అది ఎప్పుడు మొదలు అవుతుంది అనేది మాత్రం తెలీదు. దాని గురించి రాజమౌళి ఏమి చెప్పలేదు. కాస్త టైం తీసుకుని ఈ మూవీ ని మొదలు పెడతారేమో మరి.. అలానే SSMB29 నెక్స్ట్ ఇయర్ అయినా స్టార్ట్ అవుతుందా అని అంతా చూస్తున్నారు. మహేష్ కోసం కూడా పెద్ద గానే ప్లాన్ చేసుండచ్చని అని అంతా అంటున్నారు. పాన్ ఇండియా రేంజ్ కి వెళ్లిన జక్కన్న నుండి ఈ మాత్రం ఎక్స్పెట్ చెయ్యడం తప్పే కాదు.
End of Article