Home Filmy Adda Mahesh Babu : “ఇది మహేషే మొదలు పెట్టాడు.!” అంటూ… వైరల్ అవుతున్న రాజమౌళి కామెంట్స్..!

Mahesh Babu : “ఇది మహేషే మొదలు పెట్టాడు.!” అంటూ… వైరల్ అవుతున్న రాజమౌళి కామెంట్స్..!

by Mohana Priya

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.

సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలయ్యింది. ఇందులో కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు స్నేహం, వారి కష్టాలు, వారు ఎలా కలిశారు, అసలు వారు ఎలా పెరిగారు, ఇలా చాలా అంశాలని ఈ ట్రైలర్‌లో చూపించారు. ఇదంతా మాత్రమే కాకుండా, అన్నికంటే ముఖ్యంగా వీళ్లిద్దరూ కలిసి బ్రిటిష్ వాళ్లతో ఎలా పోరాడారు అనేది కూడా చూపించారు.

rajamouli tweets thanking mahesh babu

ఈ సినిమా విడుదల సందర్భంగా చాలా పెద్ద సినిమాలు సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్నాయి. వాటిలో మొదటిది సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట. ఈ సినిమా జనవరి 2022 లో విడుదలవ్వాల్సి ఉంది. కానీ విడుదల వాయిదా పడినట్టు ప్రకటించారు.  అలాగే సంక్రాంతి రిలీజ్ అనుకున్న భీమ్లా నాయక్ సినిమా బృందం కూడా ఇవాళ విడుదల వాయిదా పడినట్టు ప్రకటించింది. అంతే కాకుండా ఎఫ్ 3 సినిమా బృందం కూడా వేరే విడుదల తేదీని ప్రకటించారు.

rajamouli tweets thanking mahesh babuఈ నేపథ్యంలో రాజమౌళి అందరికీ థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేశారు. మహేష్ బాబు గురించి మాట్లాడుతూ, “అసలు సంక్రాంతి రిలీజ్ సినిమాలు వాయిదా వేయడం అనే విషయం మొదలు పెట్టింది మహేష్. దీనివల్ల ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంది. నా హీరోకి థ్యాంక్స్” అని చెప్పి ట్వీట్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ కి, ఎఫ్ 3 సినిమా బృందానికి కూడా థ్యాంక్స్ చెప్పారు.

You may also like