“రాజన్న” చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? వైరల్ అవుతున్న ఈ 12 ఫోటోలు చూస్తే ఫిదా అవ్వకుండా ఉండలేరు.!

“రాజన్న” చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? వైరల్ అవుతున్న ఈ 12 ఫోటోలు చూస్తే ఫిదా అవ్వకుండా ఉండలేరు.!

by Mohana Priya

Ads

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ఎన్నో సినిమాల్లో నటించారు బేబీ ఆనీ (Annie). ఆనీ మలయాళ కుటుంబానికి చెందినవారు. ఆనీ తనకి నాలుగేళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి నటించడం మొదలు పెట్టింది. 2005 లో వచ్చిన అనుకోకుండా ఒక రోజు సినిమాలో ట్యూషన్ స్టూడెంట్ గా కనిపించింది.

Video Advertisement

తర్వాత స్టాలిన్, విజయదశమి, అతిధి సినిమాలో అమృత రావు చిన్నప్పటి పాత్రలో, శౌర్యం సినిమాలో గోపీచంద్ చెల్లెలిగా నటించిన పూనమ్ కౌర్ చిన్నప్పటి పాత్రలో, ఏక్ నిరంజన్, మిత్రుడు, కేడి, స్వాగతం సినిమాల్లో కూడా నటించింది. 2011 లో వచ్చిన రాజన్న సినిమాలో మల్లమ్మ పాత్ర పోషించింది.

ఈ సినిమాలో తన నటనకి ఎన్నో ప్రశంసలు అందుకుంది ఆనీ. అలాగే బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్ గా నంది అవార్డు, ఫిలిం ఫేర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు కూడా అందుకుంది. తెలుగులో మాత్రమే కాకుండా 2010 లో శివ అనే భోజ్ పురీ సినిమాలో కూడా నటించింది ఆనీ. తర్వాత 2012 లో నువ్వెక్కడుంటే నేనక్కడుంటా, చదువుకోవాలి సినిమాల్లో నటించింది.

మళ్లీ దాదాపు ఆరు సంవత్సరాల విరామం తర్వాత 2018 లో వచ్చిన రంగస్థలం సినిమాలో రామ్ చరణ్, ఆది పినిశెట్టి చెల్లెలిగా నటించింది ఆనీ. సినిమాల్లో మాత్రమే కాకుండా సీరియల్స్ లో కూడా నటించింది. 2007 లో ట్రాప్ అనే ఒక టెలి ఫిలింకి, 2010 లో గోరింటాకు సీరియల్ కి నంది అవార్డులను కూడా అందుకుంది.

అలాగే ఇటీవల జీ 5 లో విడుదలైన లూజర్ వెబ్ సిరీస్ లో రూబీ పాత్ర పోషించింది.  ఆనీ, హైదరాబాద్ లోని అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో చదువుతోంది. ఆనీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా తనకు సంబంధించిన విషయాలను పోస్ట్ చేస్తూ, అలాగే కొన్ని బ్రాండ్స్ ని కూడా ప్రమోట్ చేస్తోంది.

image credits: instagram.com/a_n_n_i_e7


End of Article

You may also like