Ads
ఐపీఎల్ 2020 లో సెప్టెంబర్ 27వ తేదీన రాజస్థాన్ రాయల్స్ జట్టు కి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 226/6 తో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. చివరిలో రాజస్థాన్ రాయల్స్ 18 బంతుల్లో 51 పరుగులు చేయాల్సి ఉండగా 18 వ ఓవర్ వేసిన కాట్రెల్ బౌలింగ్ లో రాహుల్ తెవాటియా (53: 41 బంతుల్లో 7×6) వరుసగా 6, 6, 6, 6, 0, 6 చేశారు. సంజు శాంసన్ (85: 42 బంతులలో 4×4, 7×6) స్కోర్ చేశారు.
Video Advertisement
గత మంగళవారం అంటే సెప్టెంబర్ 22వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఇంకా రాజస్థాన్ రాయల్స్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో సంజూ శాంసన్ 32 బంతుల్లో 74 (1×4, 9×6) చేశారు.
అంతేకాకుండా సెప్టెంబర్ 27వ తేదీన జరిగిన మ్యాచ్ లో 85 పరుగుల లో 4 ఫోర్లు, 7 సిక్సర్లు చేసినందుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్ కూడా అందుకున్నారు సంజూ శాంసన్. దాంతో సంజూ శాంసన్ ఆట తీరుపై క్రికెట్ అభిమానులతో పాటు ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సంజూ శాంసన్ ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ” సంజూ శాంసన్ రోజు ఎలాంటి డైట్ పాటిస్తారో ఎవరైనా చెప్పగలరా?” అని అన్నారు ఆనంద్ మహీంద్రా.
దానికి రాజస్థాన్ రాయల్స్ జట్టు ట్విట్టర్ అకౌంట్ నుండి “దాల్ బాటి చూర్మా” అని సరదాగా రిప్లై ఇచ్చారు.
అయితే కెవిన్ పీటర్సన్ రిప్లై ఇస్తూ ” అతను (సంజు శాంసన్) కొన్ని నెలలు వీగన్ గా ఉన్నారు. తర్వాత తన డైట్ లో కి మళ్లీ గుడ్లని, మాంసాన్ని యాడ్ చేశారు. లాక్ డౌన్ లో చాలా ట్రైన్ అయ్యారు. చాలా డెడికేషన్ ఉన్నవారు” అని అన్నారు.
End of Article