Ads
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హామీలను నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఇచ్చిన మాట ప్రకారం ఒక్కోటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక దివ్యంగురాలికి ఉద్యోగం ఇస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం అప్పుడు చెప్పారు.
Video Advertisement
చెప్పిన విధంగానే నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దివ్యంగురాలకి ఉద్యోగం నియమక పత్రాలు అందించారు. పూర్తి వివరాల్లోకి వెళితే…
ఈ అక్టోబరు 17న కాంగ్రెస్ పార్టీ ప్రచారం సమయంలో గాంధీ భవన్‌లో రేవంత్ రెడ్డిని ఆమె కలిశారు.తనకు ఉద్యోగం లేదన్న ఆవేదనను రేవంత్‌కు చెప్పుకున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్పకుండా మొదటి ఉద్యోగం ఆమెకే ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఆమె పేరు, ఫోన్ నంబర్ వంటి వివరాలు రాసుకుని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన పత్రంపై రేవంత్ రెడ్డి సంతకం చేసి ఆమెకు అందించారు.
ఇచ్చిన మాట ప్రకారం, పార్టీ గెలిచిన తరువాత ప్రమాణ స్వీకారోత్సవానికి రజనిని ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. దీంతో ఆమెకు ఉద్యోగ నియామక ఉత్తర్వులు తీసుకురావల్సిందిగా దివ్యాంగుల సంక్షేమ శాఖను ఆదేశించారు. రేవంత్ రెడ్డి ఆదేశాలు మేరకు ఉత్తర్వులు సిద్ధం చేసిన అధికారులు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ కు అందివ్వగా, ఆయన వాటిపై సంతకం చేసి, రజనికి శాలువా కప్పి, ఆ పత్రాలను ఆమె చేతికిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమె కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.
ఆమెకు తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీ (టీఎస్‌ఎస్ఓసీఏ)లో ప్రాజెక్టు మేనేజర్‌గా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగం కల్పించారు. ఆమెకు నెలకు రూ.50,000 వేతనం అందుతుందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రజని ఉద్యోగంపై చేసింది రెండవ సంతకం కాగా, మొదటి సంతకం ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించిన ఫైలుపై పెట్టారు సీఎం రేవంత్.
ఇచ్చిన మాట ప్రకారం రజనీకి ఉద్యోగం అందించినందుకు ఆమె కుటుంబ సభ్యులు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
End of Article