Ads
నాగబాబు గత కొద్దిరోజుల నుండి అతి సెన్సిటివ్ విషయాలు మీద మాట్లాడుతూ వివాదాలలో చిక్కుకుంటున్నారు.గతంలో గాంధీని ప్రేమించి అభిమానించిన గాడ్ సే ఆయనే స్వయంగా ఎందుకు చంపారు అన్న అంశంపై చర్చ జరగాలని మాట్లాడిన నాగబాబు తాజాగా రజినీకాంత్ దేవుడి పై చేసిన కామెంట్స్ పై స్పందించారు.
Video Advertisement
ప్రస్తుతం నాగబాబు దేవుడి పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.నాగబాబు దేవుడి పై చేసిన కామెంట్స్ పై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.అసలు నాగబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు చూద్దాం.
ట్వీట్ 1: ఒకప్పుడు superstar రజనీకాంత్ గారు చెప్పారు,,అది ఏంటంటే మన కంటికి కనబడే ఏదయినా ఎవరో ఒకరు create చేసిందే అయివుంటది. లేకపోతే ఆ వస్తువు కి ఉనికి ఉండదు.అలాగే ఇంత విశాల విశ్వం కూడా ఉనికి లో ఉందంటే ఎవరోఒక క్రియేటర్ వుండే ఉండాలి.అతడే భగవంతుడు అని చాలా గంభీరంగా చెప్పారు…
ట్వీట్ 2:ఉనికి లో ఉందంటే దానికి ఒక క్రియేటింగ్ రీసన్ వేరే ఉండాలి.ఆ రీసన్ దేవుడిని create చేసి ఉండాలి.అలాగే ఆ దేవుడిని create చేసిన రీసన్ కి ఇంకో రీసన్ ఉండాలి.సో అలా వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే అంతు పొంతూ ఉండదు
ట్వీట్ 3:సో గాడ్ అనే కాన్సెప్ట్ కి మీనింగ్ ఏది లేదు.సో లెట్స్ లివ్ our lives వితౌట్ the ఇన్వొల్వెమెంట్ of గాడ్ కాన్సెప్ట్..nietzsche చెప్పినట్లు దేవుడు చనిపోయాడు.దానికి వర్రీ చెందాల్సిన అవసరం లేదు, దేవుడిపై ఆధారపడకుండా కేవలం చట్టాలకు న్యాయలకు అనుగుణంగా బ్రతకాలి” అంటూ నాగబాబు సరికొత్తగా ట్వీట్ చేశారు.
End of Article