Home Filmy Adda మరోసారి ఆ యువ దర్శకుడితో రజనీ..? తన 170వ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌..!

మరోసారి ఆ యువ దర్శకుడితో రజనీ..? తన 170వ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌..!

by Sunku Sravan

తమిళ్‌ తలైవా రజనీకాంత్‌ మాంచి బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ కోసం వేచిచూస్తున్నారు. ఇటీవల సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కథనాయకుడిగా విడుదలైన పెద్దన్న సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది. దీంతో తలైవా  తన అభిమానులను సంతప్తి పరిచేందుకు తన 169వ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు.

ఈ సినిమాకు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తుండగా.. సన్‌ పిక్చక్స్‌ పతాకంపై తెరకెక్కుతోంది. అయితే.. దీంతో పాటు తన 170వ సినిమాపై కూడా రజనీ ఫోకస్‌ పెట్టారు. కబాలి, కాలా లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన పా.రంజిత్‌కు తన 170వ సినిమాను చేయనున్నట్లు తెలుస్తోంది. పా.రంజిత్‌ దర్శకత్వంలో వచ్చిన కబాలి, కాలా సినిమాలు అనుకున్నంతగా వసూల్లు రాబట్టకపోయినా.. దీనిలో రజనీ లుక్‌ కు అందరినీ ఆకర్షించాయి.

ఈ క్రమంలోనే ఇటీవల మరోసారి యువ దర్శకుడు పా.రంజిత్‌ ఓ కథను చెప్పడంతో నచ్చి సూపర్‌ స్టార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సూపర్‌ స్టార్‌ నటించిన దర్బార్‌ సినిమా బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత వచ్చిన ఏ సినిమా కూడా మళ్లీ సూపర్‌స్టార్‌ ఖాతాలో విజయాన్ని తీసుకురాలేదు. అయితే.. ఇప్పుడు తెరకెక్కుతున్న సినిమానులైనా విజయం పరంపరంను కొనసాగిస్తాయో చూడాలి మరీ..

You may also like