రాఖీ కట్టమంటే ఆ చెల్లెలు ఏం కట్టిందో తెలుసా? దీంతో అన్నయ్య ఇచ్చిన గిఫ్ట్ చూస్తే నవ్వాపుకోలేరు!

రాఖీ కట్టమంటే ఆ చెల్లెలు ఏం కట్టిందో తెలుసా? దీంతో అన్నయ్య ఇచ్చిన గిఫ్ట్ చూస్తే నవ్వాపుకోలేరు!

by Megha Varna

Ads

రాఖీ పండుగ అంటే అన్నా చెల్లెళ్ళ బంధానికి నిదర్శనం. ఈ పండుగ ఎప్పుడు వస్తుంది అని చెల్లెలు వెయిట్ చేస్తుంటే అన్నలు మాత్రం ఈ పండుగ రోజు చెల్లెళ్లకు గిఫ్ట్ ఇవ్వడానికి డబ్బులు ఎక్కడ నుండి తేవాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటారు.

Video Advertisement

సాధారణంగా అనుబంధాలు, ఆత్మీయతల మీద తెలుగులో బోలెడన్ని చిత్రాలు ఉన్నాయి.కాని వాటి అన్నిటికంటే రాఖీ పండుగ కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగులో ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ రాఖీ పండగ గురించి దాని విశిష్టత గురించి మనం చిన్నప్పటి నుండి సినిమాలు,సీరియల్ లలో బోలెడు సార్లు చూసున్నాం మళ్లీ వాటి గురించి చెప్పి నేను మిమ్మల్ని విసిగించను లెండి విషయంలోకి వెళ్తాను.

నేడు రక్షాబంధన్ సందర్భంగా ఓ చెల్లి అన్నయ్యకి పూలు కట్టడానికి వాడే దారాన్ని కట్టి. రాఖీ కట్టానుగా మరి నా గిఫ్ట్ ఏది అని అడిగింది. ఇది రాఖీ నా? అని అన్నయ్య అడిగాడు.దానికి చెల్లెలు రాఖీ అంటే నమ్మకం అంతేకాని అది కలర్ దారమా లేక పూలు కట్టే దారమా అనేది చూడకూడదు అని అన్నది.

దానితో ఆ అన్నయ్య తను వాడే రేజర్ చెల్లెలు చేతిలో పెట్టాడు.నేను ఇదేం చేసుకోవాలి అని అడిగింది?దానికి ఆ అన్నయ్య లెజెండ్ లో బ్రహ్మానందం లాగా డబ్బులు ఇస్తే ఖర్చు చేసేస్తావు.అదే నీకు ఉపయోగపడేది ఇస్తే పూర్తిగా వాడి పాడు చేసేస్తావు అందుకే జ్ఞాపకంగా దాచుకుంటావని ఇది ఇచ్చాను అని కౌంటర్ ఇచ్చాడు.

దాంతో చెల్లి ఇంటి పక్కన ఉన్న షాప్ కి వెళ్ళి రాఖీ తెచ్చి కట్టింది. ఆతర్వాత మనోడు 500 రూపాయిలు ఆ చెల్లికి ఇచ్చాడు.ఈ అన్నా చెల్లెలు కథ సోషల్ మీడియా పుణ్యాన బయటకు వచ్చింది.


End of Article

You may also like