పాయ‌ల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ‘ర‌క్ష‌ణ‌’…టైటిల్‌ పోస్ట‌ర్ విడుద‌ల‌

పాయ‌ల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ‘ర‌క్ష‌ణ‌’…టైటిల్‌ పోస్ట‌ర్ విడుద‌ల‌

by Harika

Ads

‘Rx100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనదైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న సినిమా ‘ర‌క్ష‌ణ‌’. రోష‌న్‌, మాన‌స్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో పాయ‌ల్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో మెప్పించ‌బోతున్నారు. ఈ మూవీ శ‌ర‌వేగంగా రూపొందుతోంది.

Video Advertisement

హ‌రిప్రియ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా రూపొందుతోన్న ఈ సినిమాను త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌ణ‌దీప్ ఠాకోర్‌. ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు పాయ‌ల్ రాజ్‌పుత్ చేసిన సినిమాల‌కు ఇది పూర్తి భిన్న‌మైన సినిమా. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఆసాంతం క‌ట్టిప‌డేయ‌నున్న ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌లో తొలిసారి పోలీస్ ఆఫీస‌ర్‌గా పాయ‌ల్‌ మెప్పించ‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా…

ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ మాట్లాడుతూ ‘‘ర‌క్ష‌ణ ఓ క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా. పాయల్ రాజ్‌పుత్‌ను సరికొత్త కోణంలో చూపించే సినిమా. నటిగా ఆమెకు మంచి ఇమేజ్‌ను తీసుకొస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటన స్పూర్తితో రాసిన కథతో సినిమా రూపొందింది. ఏ దశలోనూ రాజీ పడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కించాం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

న‌టీన‌టులు:

పాయ‌ల్ రాజ్‌పుత్‌, రోష‌న్‌, మాన‌స్‌, రాజీవ్ క‌న‌కాల‌, వినోద్ బాల‌, శివ‌న్నారాయ‌ణ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

దర్శకుడు: ప్రణదీప్ ఠాకోర్, నిర్మాత: ప్రణదీప్ ఠాకోర్ , నిర్మాణ సంస్థ: హరిప్రియ క్రియేషన్స్, ఛాయాగ్రహణం: అనిల్ బండారి, సంగీతం: మహతి స్వ‌ర‌ సాగర్, సౌండ్ డిజైనర్: జె.ఆర్. ఎతిరాజ్, ఎడిటర్: గ్యారి బి హెచ్, స్టంట్స్: వెంకట్ మాస్టర్, ప్రొడక్షన్ డిజైన్: రాజీవ్ నాయర్, రైటర్: తయనిధి శివకుమార్, స్టిల్స్:ఎ. దాస్, పబ్లిసిటీ డిజైనర్: రమాకాంత్, వీఎఫ్ఎక్స్: అలగర్‌సామి, ,మయాన్- ప్రదీప్ పుడి, కోడైరెక్టర్: రాఘవేంద్ర శ్రీనివాస, పి.ఆర్‌.ఒ: నాయుడు సురేంద్రకుమార్, ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: ప్రకాష్ జోసెఫ్, రమేష్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: శరద్ వాఘ్రే, ప్రొడక్షన్ కంట్రోలర్: శ్రీనివాస్ కమ్మెల, కాస్ట్యూమ్స్: శ్రీను కనుమోలు, మేకప్: కోటి లకావత్.


End of Article

You may also like