Home Filmy Adda డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన రకుల్ ప్రీత్ సింగ్.!

డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన రకుల్ ప్రీత్ సింగ్.!

by Mohana Priya

ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసు విషయంలో ఇవ్వాళ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఉదయం 10:30 కార్యాలయానికి రావలసిందిగా అధికారులు నోటీసులు పంపగా మాత్రం 9:10 నిమిషాలకు కార్యాలయానికి చేరుకున్నారు. రకుల్ తో పాటు చార్టెడ్ అకౌంటెంట్ న్యాయవాది కూడా వెళ్లారు.rakul appears before enforcement directorate in hyderabad

ఇందులో రకుల్ ని 6 గంటలు విచారణ చేసినట్టు సమాచారం. పలు అనుమానాస్పద ఆస్తులపై వివరాలు అడిగారు. అలాగే డ్రగ్ పెడ్లర్ కెల్విన్ తెలుసా అని అడగగా రకుల్ ప్రీత్ సింగ్ తెలియదు అని సమాధానం చెప్పారు. ఈ కేసులో ఈ నెల 8వ తేదీన రానా దగ్గుబాటి, ఆ తర్వాత మరికొంతమంది సెలెబ్రిటీలు విచారణకు హాజరు అవ్వడం ఉన్నారు. వీరిలో రవితేజ, శ్రీనివాస్, నవదీప్, ముమైత్ ఖాన్, తనీష్, నందు, తరుణ్ ఉన్నారు.

You may also like