Ads
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కేవలం తెలుగు మాత్రమే కాకుండా, తమిళం, హిందీ భాషల్లో కూడా రకుల్ సినిమాలు చేస్తున్నారు. హిందీలో ఆయుష్మాన్ ఖురానా డాక్టర్ G అనే సినిమాతో పాటు, అజయ్ దేవగన్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 తో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ తన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అని మనందరికీ తెలుసు.
Video Advertisement
రకుల్ తరచుగా వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. గత 2 సంవత్సరాల నుండి చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. బరువు తగ్గిపోయి బక్కగా అయిపోయారు. కొంత కాలం ట్రోలింగ్ కి కూడా గురయ్యారు. ఒక సందర్భంలో తన హిందీ సినిమా దే దే ప్యార్ దే కోసం ఇలా సన్నబడి నట్లు చెప్పారు. ఇది 2 సంవత్సరాల క్రితం విషయం. రకుల్ ఇప్పుడు కూడా అలాగే సన్నగా ఉన్నారు. అయితే రకుల్ ఇటీవల ఇంస్టాగ్రామ్ లో ఒక ఫోటో పోస్ట్ చేశారు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ పోస్ట్ చేసిన ఈ ఫోటోపై ఎన్నో కామెంట్స్ వస్తున్నాయి.
అందులో ఒక వ్యక్తి ఈ విధంగా రాశారు, “ఇదేంటి ఈమె కూడా సర్జరీ చేయించుకుంది? ఈ బాలీవుడ్ వాళ్ళందరికీ ఏమయింది? అందంగా ఉన్న ముఖాలని ఇలా సర్జరీలతో పాడుచేసుకుంటున్నారు?” అని రాశారు. అందుకు రకుల్ ప్రీత్ సింగ్ మేకప్ ఆర్టిస్ట్ సలీం సయ్యద్ ఈ విధంగా రిప్లై ఇచ్చారు, “ఆమె ఫోటో కోసం ఫిల్టర్ యూజ్ చేసింది. ఆమె ఎటువంటి సర్జరీ చేయించుకోలేదు. హాష్ ట్యాగ్ చూడు.” ఇందుకు రకుల్ ప్రీత్ సింగ్, తన మేకప్ ఆర్టిస్ట్ ఇచ్చిన రిప్లైకి స్పందిస్తూ ” వదిలేయ్. అలాంటివి వాళ్ళు చదివితే బాగుంటుంది.” అని రిప్లై ఇచ్చారు.
End of Article