Home Filmy Adda ఎవరీ జాకీ భగ్నానీ.? అసలు రకుల్ కి ఎలా పరిచయం అయ్యాడు.?

ఎవరీ జాకీ భగ్నానీ.? అసలు రకుల్ కి ఎలా పరిచయం అయ్యాడు.?

by Mohana Priya

నటి రకుల్ ప్రీత్ సింగ్ అక్టోబర్ 10వ తేదీ నాడు సోషల్ మీడియా వేదికగా తన రిలేషన్ షిప్ గురించి ప్రకటించారు. ఆరోజు రకుల్ ప్రీత్ సింగ్ పుట్టిన రోజు కూడా. సాధారణంగా రకుల్ ప్రీత్ సింగ్ చాలా ఇంటర్వ్యూస్ లో తను సింగిల్ అని, ప్రేమించడానికి సరైన అబ్బాయి దొరకడం లేదు అని చెప్పారు. కొన్ని నెలల క్రితం వచ్చిన సామ్ జామ్ లో కూడా ఇదే విషయాన్ని చెప్పారు.

rakul preet singh boy friend jacky bhagnani unknown details

కానీ ఇప్పుడు సడన్ గా రకుల్ ప్రీత్ సింగ్ తాను ఇష్టపడుతున్న వ్యక్తిని సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమించిన వ్యక్తి పేరు జాకీ భగ్నానీ. అతను కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే. జాకీ తండ్రి వషు భగ్నానీ బాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరు. 2009 లో విడుదలైన కల్ కిస్నే దేఖా అనే హిందీ సినిమాతో హీరోగా తన కెరియర్ మొదలుపెట్టిన జాకీ కూడా ఎన్నో హిందీ సినిమాల్లో నటించారు.

rakul preet singh boy friend jacky bhagnani unknown details

తెలుగులో సూపర్ హిట్ అయిన సీమటపాకాయ్ సినిమాని అజబ్ గజబ్ లవ్ గా, పెళ్లిచూపులు సినిమాని మిత్రోన్ గా రీమేక్ చేశారు. ఈ రెండు సినిమాల్లో జాకీ హీరోగా నటించారు. లీడర్ సినిమాకి దగ్గరగా ఉన్న స్టోరీలైన్ తో యంగిస్థాన్ సినిమాని రూపొందించారు. ఈ సినిమాలో కూడా జాకీ హీరోగా నటించారు. అంతే కాకుండా త్రిష హీరోయిన్ గా నటించిన మోహిని సినిమాలో కూడా జాకీ నటించారు. రకుల్, జాకీ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంత మంది కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిశారు. అలా వీరికి పరిచయం ఏర్పడింది అని తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది అని సమాచారం.

You may also like