Home Filmy Adda RRR కి “మెరుపు వేగంతో” వీడ్కోలు పలికిన రామ్ చరణ్, ఎన్టీఆర్.!

RRR కి “మెరుపు వేగంతో” వీడ్కోలు పలికిన రామ్ చరణ్, ఎన్టీఆర్.!

by Mohana Priya

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.

అయితే ఇవాళ ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని సినిమా బృందం సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. సినిమా చివరి షాట్ పూర్తి చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి కార్లలో వెళ్లే వీడియోని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సినిమా అక్టోబర్ లో విడుదల అవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా సినిమా బృందం అదే డేట్ ని ఫాలో అవుతారో లేకపోతే మారుస్తారో తెలియదు.

watch video :

You may also like