Home Filmy Adda RRR తర్వాత టెన్షన్‌లో రామ్ చరణ్ ఫ్యాన్స్..! కారణమేంటంటే..?

RRR తర్వాత టెన్షన్‌లో రామ్ చరణ్ ఫ్యాన్స్..! కారణమేంటంటే..?

by Mohana Priya

ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?

వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి. ఇందులో రామ్ చరణ్ నటనకి చాలా ప్రశంసలు వస్తున్నాయి. అన్ని షేడ్స్ ఉన్న పాత్రలో రామ్ చరణ్ బాగా చేశారు అని అంటున్నారు. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ కి అంత మంచి పాత్ర పడింది.

అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ లో కొత్త టెన్షన్ మొదలయ్యింది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఆచార్య సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది. ఆచార్యలో రామ్ చరణ్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి నిర్మాత కూడా రామ్ చరణ్. దాంతో సినిమాకి సంబంధించిన ప్రమోషన్ ప్రోగ్రామ్స్ లో రామ్ చరణ్ కచ్చితంగా పాల్గొనాల్సి వస్తుంది. దాంతో జూనియర్ ఎన్టీఆర్ కి బ్రేక్ దొరికింది కానీ రామ్ చరణ్ కి దొరకడం కష్టం ఏమో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అలాగే ఈ సినిమా తర్వాత విడుదల అయ్యే సినిమా ఆచార్య కాబట్టి రిజల్ట్ ఎలా ఉంటుందో అని అనుకుంటున్నారు.

You may also like