“మెరుపు, గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్” తో పాటు … అనౌన్స్ చేసిన తర్వాత ఆగిపోయిన 6 “రామ్ చరణ్” సినిమాలు..!

“మెరుపు, గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్” తో పాటు … అనౌన్స్ చేసిన తర్వాత ఆగిపోయిన 6 “రామ్ చరణ్” సినిమాలు..!

by Mohana Priya

Ads

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు ప్రకటించడం తర్వాత అవి మొదలు పెట్టడం మధ్యలో ఆపేయడం అనేది సహజం. అందులో చాలా మంది పెద్ద హీరోల సినిమాలు కూడా ఉంటాయి.

Video Advertisement

ఆ సినిమాలు ఆపేయడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అలా రామ్ చరణ్ హీరోగా నటించిన కొన్ని సినిమాలు కూడా ప్రకటించిన తర్వాత ఆగిపోయినవి ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. మణి రత్నం ప్రాజెక్ట్

అప్పట్లో రామ్ చరణ్ మణిరత్నంతో కలిసి మూవీ చేస్తున్నట్టు ఇండస్ట్రీలో టాప్ నడిచింది. అయితే ఈ విషయం గురించి అఫీషియల్ గా ఎటువంటి ప్రకటన బయటకు రాలేదు. కానీ రూమర్స్ ప్రకారం ఇది ఒక యాక్షన్ డ్రామా అని, కొన్ని అనుకోని కారణాల వల్ల ప్రాజెక్టు ముందుకు సాగలేదని తెలుస్తుంది.

ram charan movies which got shelved after the announcement

2. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రొడక్షన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ మూవీ రాబోతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆ తరువాత దాని గురించి ఎటువంటి ఊసు బయటకు రాలేదు.

ram charan movies which got shelved after the announcement

3. మెరుపు

2010 రొమాంటిక్ హిట్ ఆరెంజ్ మూవీ తర్వాత రామ్ చరణ్ మెరుపు అని స్పోర్ట్స్ డ్రామా మూవీ కోసం రెడీ అయ్యాడు. ఈ మూవీ కి డైరెక్టర్ గా తమిళ్ డైరెక్టర్ ధరణి ని ఎంచుకున్నారు.ఇది ఒక రకంగా రామ్ చరణ్ డ్రీమ్ ప్రాజెక్ట్. కానీ తెలియని కారణాలవల్ల ఈ చిత్రం ఆగిపోయింది. ఈ మూవీ గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ ” నేను కంటెంట్-ఆధారిత స్పోర్ట్స్ డ్రామా చేయాలనుకుంటున్నాను మరియు సరైన స్క్రిప్ట్ కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నా కెరీర్ ప్రారంభంలో నేను R.B. చౌదరి తో క్రీడల నేపథ్యం ఆధారంగా ఒక చిత్రాన్ని ప్రారంభించాను. కానీ కొని అనుకోని కారణాల వల్ల, అది ఆగిపొయింది. ఇంక ఆ తర్వాత, నాకు క్రీడలకు సంబంధించిన సబ్జెక్ట్‌లు ఏవీ రాలేదు” అని చెప్పారు.

ram charan movies which got shelved after the announcement

4. ఏఆర్ మురుగదాస్ ప్రాజెక్ట్

ఒకసారి ఏదో ఫంక్షన్ లో రామ్ చరణ్ స్వయంగా మురుగన్ తో సినిమా చేయాలని ఉందని చెప్పారు. దాంతో వెంటనే వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వస్తుంది అని వార్త బాగా వైరల్ అయింది. కానీ ఆ తర్వాత ఈ విషయం గురించి ఎటువంటి వార్తలు బయటకు రాలేదు.

ram charan movies which got shelved after the announcement

5. కొరటాల శివ ఫిల్మ్

కొరటాల శివ రామ్ చరణ్ తో మూవీ చేయాలి అని అనుకున్నాడట. ఆ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన ,పూజా కార్యక్రమం కూడా జరిగింది. కానీ తెలియని కారణాలవల్ల ఆ సినిమా సెట్స్ కి వెళ్ళకముందే ఆగిపోయింది.

ram charan movies which got shelved after the announcement

6. గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్

ఈ ప్రాజెక్టు గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన బయటకు రాలేదు. కానీ ఈ ప్రాజెక్ట్ షెల్వ్ అయినట్టు మాత్రం రిపోర్ట్స్ వచ్చాయి. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ స్టోరీ చరణ్ కు నచ్చలేదంట. మార్పులు చేసినప్పటికీ ఈ చిత్రం సెకండ్ హాఫ్ చరణ్ కి సంతృప్తిని ఇవ్వలేదంట. అదే ఈ ప్రాజెక్టు ఆగిపోవడానికి కారణం అని భావిస్తున్నారు.

ram charan movies which got shelved after the announcement


End of Article

You may also like