Ads
మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, ఇప్పుడు గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగారు రామ్ చరణ్. రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా ఈ సినిమాలో నటిస్తున్నారు. వీళ్ళిద్దరూ గతంలో వినయ విధాయ రామ సినిమాలో నటించారు. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. మార్చ్ లో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని జరగండి పాట విడుదల చేశారు. ఈ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Video Advertisement
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్, బుచ్చి బాబు సానా దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తారు. అయితే, చిరంజీవి ఇటీవల పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. ఇందుకోసం చిరంజీవితో పాటు, కుటుంబం అంతా కూడా వెళ్లారు. రామ్ చరణ్, ఉపాసన కూడా వెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. ఇందులో రామ్ చరణ్ ఫోన్ వాల్ పేపర్ కూడా కనిపించింది. సాధారణంగా రామ్ చరణ్ ఫోన్ వాల్ పేపర్ అంటే, తన ఫోటో కానీ, ఉపాసన ఫోటో కానీ, కూతురి ఫోటో కానీ, లేదా తన తల్లిదండ్రుల ఫోటో కానీ ఉంటుంది అని అనుకుంటారు.
కానీ వీళ్ళందరూ ఫోటో కాకుండా రామ్ చరణ్ మరొక ఫోటోని తన వాల్ పేపర్ గా పెట్టుకున్నారు. రామ్ చరణ్ ఆంజనేయ స్వామి ఫోటోని తన ఫోన్ వాల్ పేపర్ గా పెట్టుకున్నారు. చిరంజీవి ఆంజనేయ స్వామి భక్తులు అనే సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కూడా ఆంజనేయ స్వామిని పూజిస్తారు. అందుకనే రామ్ చరణ్ తన ఫోన్ వాల్ పేపర్ గా ఆంజనేయ స్వామి ఫోటోని పెట్టుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఒక నెటిజన్ గమనించి షేర్ చేశారు.
End of Article