మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఆచార్య. ఈ సినిమా షూటింగ్ పూర్తయినా కూడా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. ఇందులో చిరంజీవి పక్కన కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 తర్వాత వారిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండవ సినిమా ఇది.

Video Advertisement

ఈ సినిమాపై ఇంత ఆసక్తి క్రియేట్ అవ్వడానికి ముఖ్య కారణం చిరంజీవి అయితే, మరొక కారణం చిరంజీవి, రామ్ చరణ్  కలిసి నటించడం.  చాలా కలం తర్వాత ఇద్దరినీ ఒకే స్క్రీన్ మీద చూడడం, అది కూడా ఇద్దరినీ ఫుల్ లెన్త్ రోల్ లో చూడడం అనే విషయం సినిమా మీద ఆసక్తిని ఇంకా పెంచింది. అయితే, ఇందులో రామ్ చరణ్ పాత్ర నిడివి ఏంటి? అసలు ఎంత సేపు కనిపిస్తారు? అనే ప్రశ్న అందరిలో నెలకొంది.

ram charan role duration in acharya movie

ఈ విషయంపై  ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక వార్త ప్రకారం, ఈ సినిమాలో రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కనిపిస్తారట. రామ్ చరణ్ పోషిస్తున్న సిద్ధ పాత్ర నిడివి 40 నిమిషాల వరకు ఉంటుందని సమాచారం. రామ్ చరణ్ కి పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆచార్య సినిమా ఫిబ్రవరి 2022 లో విడుదల అవుతుంది అని సినిమా బృందం ప్రకటించింది.