బాలీవుడ్ స్టార్ హీరోతో నటించబోతున్న రామ్ చరణ్..? ఆ హిట్ సినిమా సిరీస్ భాగంలో..?

బాలీవుడ్ స్టార్ హీరోతో నటించబోతున్న రామ్ చరణ్..? ఆ హిట్ సినిమా సిరీస్ భాగంలో..?

by Mohana Priya

Ads

ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న హీరోల్లో రామ్ చరణ్ ఒకరు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు.

Video Advertisement

ఇంకా చాలా మంది ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రి కొడుకుల పాత్రలో నటిస్తారు. రాజకీయాల మీద ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు.

ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా అని అంటున్నారు. అయితే వీటి తర్వాత రామ్ చరణ్ ఒక బాలీవుడ్ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. బాలీవుడ్ లో ధూమ్ సిరీస్ కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఎంతో మంది స్టార్ హీరోలు ఈ సినిమాలో నటించారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఈ సిరీస్ లో భాగం కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అమీర్ ఖాన్ ధూమ్ 3 సినిమాలో నటించారు. ఇప్పుడు ధూమ్ 4 కోసం షారుఖ్ ఖాన్ ముందుకి వస్తున్నారు.

ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు అనే వార్త ఒకటి ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తారు అని అంటున్నారు. రామ్ చరణ్ ఇప్పటి వరకు ఒక్క బాలీవుడ్ సినిమా చేయకపోయినా కూడా బాలీవుడ్ లో రామ్ చరణ్ కి చాలా క్రేజ్ ఉంది. ఇప్పుడు డైరెక్ట్ బాలీవుడ్ సినిమా చేస్తే రామ్ చరణ్ కి క్రేజ్ ఇంకా పెరుగుతుంది అని అంటున్నారు. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియదు. ఒకవేళ ఇది నిజం అయితే ఇద్దరు స్టార్ హీరోలని తెరపై చూడడం అనేది చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది.


End of Article

You may also like