“రామ్ చరణ్-ఉపాసన” పాప పేరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారా..? ఏం చెప్పారంటే..?

“రామ్ చరణ్-ఉపాసన” పాప పేరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారా..? ఏం చెప్పారంటే..?

by Mohana Priya

Ads

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. వారికి ఒక అమ్మాయి పుట్టింది. దాంతో మెగా ఫ్యామిలీ అంతా కూడా ఘనంగా సంబరాలు చేసుకుంటోంది.

Video Advertisement

డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్ లో ఉన్న ఉపాసన, పాపని చూడడానికి మెగా కుటుంబానికి చెందిన సభ్యులు అందరూ కూడా ఒక్కొక్కరిగా వెళ్లి వచ్చారు. చిరంజీవి కూడా ఈ విషయంపై మాట్లాడుతూ తనకు చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు.

ram charan upasana baby name

అయితే నిన్న ఉపాసన హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఉపాసన, పాపతో పాటు రామ్ చరణ్ కూడా కలిసి వస్తున్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా రామ్ చరణ్ విలేఖరులతో మాట్లాడి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తాను చాలా ఆనందంగా ఉన్నాను అని అన్నారు. ఒక విలేఖరి, “పాపకి ఎవరి పోలికలు వచ్చాయి?” అంటే, “నా పోలికలు వచ్చాయి” అని చెప్పారు.

అలాగే పాపకి పెట్టే పేరు విషయంపై కూడా ఇప్పటికే చాలా చర్చలు నెలకొన్నాయి. సెలబ్రిటీ పిల్లలు అంటే ఆ మాత్రం ఆసక్తి ఉండడం సహజమే. అది కూడా రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో పిల్లలు అంటే ఇప్పటికి రామ్ చరణ్ కి ఉన్న క్రేజ్ కి ఆసక్తి ఇంకా పెరిగింది. ఈ విషయంపై కూడా రామ్ చరణ్ మాట్లాడారు. రామ్ చరణ్, ఉపాసన పాపకి పెట్టాల్సిన పేరు గురించి నిర్ణయించుకున్నారు అని, 21 రోజు ఫంక్షన్ చేసి పేరు ప్రకటిస్తాము అని చెప్పారు.

secret revealed about ram charan, upasana baby..!!

అయితే ప్రస్తుతం రామ్ చరణ్ షూటింగ్ కి బ్రేక్ తీసుకున్నారు. తన భార్య, బిడ్డతో ఉండాలి అని, ఈ సమయంలో తన భార్యకి తోడుగా ఉండాలి అని రామ్ చరణ్ నిర్ణయించుకున్నారు. దాంతో రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ కి విరామం ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. సాధారణంగా శంకర్ సినిమాలు అంటే అదొక రకమైన ఆసక్తి ఉంటుంది.

secret revealed about ram charan, upasana baby..!!

ఒక సందేశాన్ని అంత భారీగా చూపించడం, అది కూడా కమర్షియల్ అంశాలు కలిపి చూపించడం అనేది చాలా పెద్ద విషయం. ఇలా చూపించడానికి ప్రయత్నించే దర్శకుల్లో శంకర్ మొదటి వరుసలో ఉంటారు. ఇప్పటి వరకు వచ్చిన శంకర్ సినిమాలు అన్నీ కూడా కమర్షియల్ అంశాలు ఉంటూనే, సమాజంలో జరిగే కొన్ని విషయాలపై ఒక సందేశాన్ని ఇస్తున్నట్టుగా ఉంటాయి. మరి ఈ సినిమాలో ఎలాంటి సందేశం ఉంటుంది అనేది చూడాల్సిందే.

ALSO READ : “రామ్ చరణ్-ఉపాసన” అంబిలికల్ కార్డ్ రక్తాన్ని ఎందుకు దాచారు..? దానికి ఎంత ఖర్చు అవుతుంది..?


End of Article

You may also like