Ads
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా నడుస్తున్న ఒకటే విషయం మా ఎన్నికలు. ఈ సారి ఎన్నికలు ప్రతి సంవత్సరం కంటే కొంచెం ఎక్కువగానే చర్చలో ఉన్నాయి. ఈ సారి మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, హేమ అలాగే జీవిత రాజశేఖర్ పోటీలో నిలబడుతున్నారు. ప్రకాష్ రాజ్ ఎన్నో భాషల్లో నటించారు. అన్ని ఇండస్ట్రీల్లోనూ ప్రకాష్ రాజ్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
Video Advertisement
అయితే “ప్రకాష్ రాజ్ మన తెలుగు వారు కారు. కాబట్టి ఆయనని ఎన్నికలలో నిలబడే అర్హత లేదు” అని ఎంతో మంది విమర్శలు చేశారు. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం ప్రకాష్ రాజ్ కి మద్దతు తెలిపారు. “ఎన్నో సంవత్సరాల నుండి ప్రకాష్ రాజ్ మన ఇండస్ట్రీకి ఎంతో సేవ చేశారు అని, తెలుగు రాకపోయినా కూడా తెలుగు నేర్చుకుని మాట్లాడారు అని, అలాగే మనమందరం అభిమానించే హీరోయిన్లు, ఇతర నటీనటులు కూడా ఈ రాష్ట్రానికి చెందిన వారు మాత్రమే కాదు” అని చెప్పారు.
ఈ విషయమై రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. “తను కాలేజ్ లో చదువుతున్నప్పుడు ఈ లోకల్ నాన్ లోకల్ అనే మాట విన్నాను అని, గ్రూపిజం అనేది ఉండడం అలవాటు అయిపోయింది అని, అన్ని రంగాల్లోనూ ఇది ఉంటుంది అని, ఫైట్ చేయడానికి ఏదో ఒక కారణం కావాలి అన్న దాంట్లో నుండి ఇలాంటి కారణం వెతుక్కున్నారు” అని అన్నారు.
“ప్రకాష్ రాజ్ ఎలాంటి వ్యక్తి? తన ఆలోచనలు ఎలా ఉన్నాయి? తను ఎలాంటి విషయాలను అమలు చేయబోతున్నారు? అనే విషయాలన్నిటినీ పక్కన పెట్టేసి, ఆయన లోకల్ కాదు. వేరే రాష్ట్రానికి చెందిన వారు అనే ఒక్క విషయం గురించి మాట్లాడడం అనేది చాలా చైల్డిష్ గా అనిపిస్తుంది” అని అన్నారు.
“సినిమా ఇండస్ట్రీలో అవతల వాళ్ళు బాగుపడాలి అని ఎవరూ కోరుకోరు అని, ఎక్కడైనా సరే నేను బాగు పడాలి అని కోరుకుంటారు అని, ఎవరి సినిమాలు వాళ్ళు తీస్తున్నారు. ఎవరి కష్టం వాళ్ళు పడుతున్నారు. ఎవరి టాలెంట్ తో వాళ్ళు ట్రై చేస్తున్నారు అని, కళామతల్లి బాగుపడాలి అనే ఆలోచన అలాంటిది ఏమీ ఉండదు” అని అన్నారు.
“డెమోక్రసీ ప్రకారం ఎవరికైనా పోటీ చేసే హక్కు ఉంటుంది. వారిలో ఎవరు కావాలి అని వోట్ చేసి ఎన్నుకునే అధికారం కూడా ఉంటుంది. ఈ లోకల్, నాన్ లోకల్ అనే ఒక్క విషయాన్ని పట్టించుకోవడం అనేది ఆ మనిషి తక్కువ ఆలోచనని చూపిస్తోంది” అని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు రామ్ గోపాల్ వర్మ.
watch video :
End of Article