రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ట్వీట్ చేస్తూ..అందరి ద్రుష్టిని ఆకర్షించే రాంగోపాల్ వర్మ. ఆయన ట్వీట్స్ కి, ఆయన ఇంటర్వూస్ కి ఎలాంటి క్రేజ్ ఉందొ అందరికి తెలిసిందే! ఇక మెగా ఫ్యామిలీ పైన, పవన్ కళ్యాణ్ రాజకీయాల పైన గతం లో ఎన్నో సార్లు స్పందించి. పవన్ ఫాన్స్ తో, మెగా ఫాన్స్ తో గొడవలు పెట్టుకున్న రామ్ గోపాల్ వర్మ.

Video Advertisement

mega-family

mega-family

మరో సారి మెగా ఫ్యామిలీ పై ట్వీట్ అస్త్రం సంధించారు. ఆగష్టు 22 మెగా స్టార్ చిరంజీవి బర్త్డే రోజు అలాగే అదే రోజు రాఖీ పౌర్ణిమ కూడా ఈ సందర్బంగా మెగా ఫ్యామిలీ అంత చిరు ఇంట్లో కలిసి సెలెబ్రేట్ చేసుకున్న ఫొటోస్, వీడియోస్ వైరల్ అయ్యాయి. చిరు ఇంట్లో పవన్ కళ్యాణ్, నాగ బాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్, నిహారిక అందరు మీట్ అయ్యారు కానీ ఈ మెగా ఫ్యామిలీ మీట్ లో ఎక్కడ బన్నీ కనపడకపోయేసరికి అల్లు అర్జున్ ఫాన్స్ పలు అనుమానాలు వ్యక్తం చేసారు.

అంతే కాదు అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ కూడా రాలేదు. ఎందుకు రాలేకపోయారో కారణాలు తెలియకపోయినప్పటికీ ఈ సందర్బంగా రామ్ గోపాల్ వర్మ పలు ట్వీట్స్ వేసి మెగా ఫాన్స్ అల్లు అర్జున్ ఫాన్స్ మధ్య కంఫ్యూజన్స్ తెచ్చారు. ఆ ట్వీట్ లో ఏముందంటే.. ‘బన్నీ నే రియల్ మెగా స్టార్ అంటూ కామెంట్స్ చేసాడు.. మెగా ఫామిలీ లో అందరికంటే కూడా అల్లు అర్జున్ నే ఎక్కువ సక్సెస్ అందుకున్నారు అంటూ ట్వీట్ చేసారు. మెగా ఫంక్షన్స్ కి అల్లు అర్జున్ అటెండ్ అవ్వకపోవడం ఆయన తెలివి తేటలకి నిదర్శనమని కొనియాడారు. ఇప్పుడు మీ ఫాన్స్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది.