Ads
వివాదానికి కేరాఫ్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ వ్యూహం. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ పరిణామాలను కథాంశంగా చేసుకుని రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించారు. దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాకు నిర్మాత. ఈనెల 10వ తేదీన వ్యూహం ఫస్ట్ పార్ట్ విడుదల కానుంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది.
Video Advertisement
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు అజ్మల్ నటించారు. వైఎస్ భారతి క్యారెక్టర్ లో మానస రాధాకృష్ణన్ నటించారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం విజయవాడ, గుంటూరు పరిసరాల్లో పూర్తి చేశారు.
అయితే వ్యూహం సినిమాను అడ్డుకోవాలంటు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెన్సార్ బోర్డుకు లేఖ రాయడం జరిగింది. ఈ సినిమాలో అనేక వివాదాస్పద సన్నివేశాలు ఉన్నాయని, అవాస్తవాలను తెరకెక్కించారు అంటూ ఆయన సెన్సార్ బోర్డు కు ఫిర్యాదు చేశారు.ఈ లేఖ తర్వాత ఈ సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వలేదు. రివైజింగ్ కమిటీకి రిఫర్ చేసింది.
రివైజింగ్ కమిటీ సినిమా చూసి సర్టిఫై చేసిన తర్వాత విడుదలవుతుంది. ఈ విషయాన్ని రాంగోపాల్ వర్మ స్పష్టం చేశారు నవంబర్ 10వ తేదీన విడుదల కాకపోవచ్చు అని పేర్కొన్నారు.దీనికి సంబంధించి హైదరాబాదులో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. సినిమా విడుదల వాయిదా పడడానికి గల కారణాలను వివరించారు. సెన్సార్ బోర్డు అనేది సినిమాను సర్టిఫై చేస్తుంది తప్ప దాని విడుదలను ఆపే అర్హత లేదని వ్యాఖ్యానించారు.
సినిమా విడుదలను అడ్డుకోలేదని అన్నారు. ఈ సినిమాలో ఎవర్ని కించపరిచే సన్నివేశాలు లేవని తనకు కనిపించింది అనిపించింది తీసాను అని పేర్కొన్నారు. ట్విట్టర్ను తనకు ఇష్టం వచ్చినట్లు వాడే రాంగోపాల్ వర్మ దీనికి సంబంధించి ఒక పోస్ట్ చేశారు. అరచేతిని అడ్డం పెట్టుకుని సూర్యుని ఆపలేరని, తన వ్యూహం సినిమాను కూడా ఎవరు అడ్డుకోలేరని అన్నారు.
ALSO READ : ఛీఛీ… ఇడ్లీని నాశనం చేశారు..! దీన్ని ఎలా తింటారో..?
End of Article