Home Filmy Adda ఆయన చనిపోతే బాధ పడాల్సిన అవసరం లేదంటూ.. ”సూపర్ స్టార్ కృష్ణ” గారి మరణం పై రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ వైరల్…!

ఆయన చనిపోతే బాధ పడాల్సిన అవసరం లేదంటూ.. ”సూపర్ స్టార్ కృష్ణ” గారి మరణం పై రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ వైరల్…!

by Megha Varna

సూపర్ స్టార్ కృష్ణ గారు తీవ్ర అనారోగ్యం తో ఆర్గాన్ ఫెయిల్యూర్ తో గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పటల్ కి కుటుంబ సభ్యులు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయన ఇవాళ ఉదయం 4 గంటలకి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

ఈ వార్తతో సినీ అభిమానులు దిగ్బ్రాంతికి లోనయ్యారు. కృష్ణ గారి పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా ఇదే ఏడాది కాలేయ సంబంధిత సమస్యతో మరణించిన సంగతి తెలిసిందే.

what happened to super star krishna..??

అంతే కాదు కృష్ణ గారి మొదటి భార్య ఇందిరా దేవి గారు కూడా రెండు నెలల క్రితం మరణించారు. ఒకవైపు పెద్ద కొడుకు, మరో వైపు భార్య ని ఒకే ఏడాదిలో కోల్పోయిన కృష్ణ గారు మానసికంగా మరింత క్షీణించారని అంటున్నారు. సంవత్సరం వ్యవధిలో నాన్న, అమ్మ, అన్న గారిని కోల్పోయారు మహేష్ బాబు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ కృష్ణ గారి పైన రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇంతకీ ట్వీట్ ఏమిటనేది చూస్తే.. కృష్ణ ఇక లేరని బాధ పడాల్సిన పని లేదు అని… ఓ లాజిక్ ని కూడా వర్మ చెప్పారు. కృష్ణ గారు, విజయ నిర్మల గారు స్వర్గంలో పాటలు పాడుతూ, డాన్సులు చేస్తారు అని కూడా రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. వీళ్లిద్దరు ఎంతో ఆనందంగా గడుపుతున్నారని భావిస్తున్నాను అని వర్మ అన్నారు. పైగా ఇద్దరి సాంగ్ ని కూడా వర్మ యాడ్ చేసారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

 

You may also like