Home Filmy Adda రేపు ఈ దుస్థితి మీ ఎవ్వరికీ తప్పదు..! స్టార్ హీరోలపై “రామ్ గోపాల్ వర్మ” పోస్ట్..!

రేపు ఈ దుస్థితి మీ ఎవ్వరికీ తప్పదు..! స్టార్ హీరోలపై “రామ్ గోపాల్ వర్మ” పోస్ట్..!

by Mohana Priya

ప్రముఖ నటుడు కృష్ణంరాజు గారు నిన్న స్వర్గస్తులయ్యారు. కృష్ణంరాజు గారు ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. కృష్ణంరాజు గారు చివరిగా రాధే శ్యామ్ సినిమాలో ఒక పాత్రలో నటించారు.

ఆ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి కూడా కృష్ణంరాజు గారు వచ్చారు. అలాగే సినిమా గురించి కూడా మాట్లాడారు. కృష్ణంరాజు గారు గత కొంత కాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

ram gopal varma tweet on star heroes going viral

కృష్ణంరాజు గారి మృతి పై ఎంతో మంది ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఎంతో మంది ప్రముఖులు కృష్ణంరాజు గారి పార్థివ దేహాన్ని సందర్శించుకోవడానికి వెళ్లారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, వెంకటేష్, నాని, విజయ్ దేవరకొండ, గోపీచంద్, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, అల్లు అర్జున్ తో పాటు ఇంకా ఎంతోమంది సినీ ప్రముఖులు వెళ్లి కృష్ణంరాజు గారి కుటుంబాన్ని పరామర్శించారు.

ram gopal varma tweet on star heroes going viral

ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన కొన్ని ట్వీట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. రామ్ గోపాల్ వర్మ ఈ విషయంపై మాట్లాడుతూ, “మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్ద మనిషికి విలువ ఇద్దాం. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్రపాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలను అందించిన మహానటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్కరోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమకి నా జోహార్లు సిగ్గు సిగ్గు.”

ram gopal varma tweet on star heroes going viral

 

ఈ విషయంపై రామ్ గోపాల్ వర్మ ఇంకా మాట్లాడుతూ, “కృష్ణ గారికి, మురళీమోహన్ గారికి, చిరంజీవి గారికి, మోహన్ బాబు గారికి, బాలయ్యకి, ప్రభాస్ కి, మహేష్, కళ్యాణ్ కి నేను ఈ విషయం మీద మనవి చేసేది ఏంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికి కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది” అని అన్నారు. ఇవాళ చాలా సినిమాల షూటింగ్ లు జరుగుతున్నాయి. దాంతో రామ్ గోపాల్ వర్మ ఈ విధంగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

You may also like